అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vande Bharat sleeper train | దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణాన్ని (Train Journey) మరో మెట్టుకు తీసుకెళ్లే దిశగా భారతీయ రైల్వే (Indian Railways) కీలక ముందడుగు వేసింది. ఇప్పటివరకు డే ట్రావెల్‌కే పరిమితమైన వందే భారత్ కాన్సెప్ట్‌ను ఇప్పుడు నైట్ జర్నీలకూ విస్తరించుతూ వందే భారత్ స్లీపర్ రైలును త్వరలో ప్రయాణికుల సేవల్లోకి తీసుకురానుంది.
ఈ ఆధునిక రైలును రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Railway Minister Ashwini Vaishnaw) ఇటీవల న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో పరిశీలించి, మీడియాతో కీలక వివరాలను పంచుకున్నారు.ప్రధానంగా దీర్ఘదూర ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసిన ఈ స్లీపర్ రైలు, సంప్రదాయ రైళ్లకు పూర్తిగా భిన్నమైన అనుభూతిని అందించనుంది. మొదటి దశలో కోల్‌కతా – గువాహటి రూట్లో ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
Vande Bharat sleeper train | ప్రయాణికుల సౌకర్యాలే ప్రధాన లక్ష్యం
వందే భారత్ స్లీపర్‌లో ప్రతి చిన్న అంశాన్ని ప్రయాణికుల కంఫర్ట్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. బెర్త్‌ల వద్ద రీడింగ్ లైట్లు, మొబైల్ లేదా పుస్తకాలు పెట్టుకునేందుకు ట్రే హోల్డర్లు, మ్యాగజైన్ స్టాండ్లు, హ్యాంగర్లు వంటి సౌకర్యాలు ఉన్నాయి. కిటికీలకు సర్దుబాటు చేసుకునే షేడ్స్ ఏర్పాటు చేయడంతో రాత్రి ప్రయాణంలో వెలుతురు ఇబ్బంది ఉండదు. వాష్ బేసిన్లు నీరు బయటకు చిందకుండా ఉండేలా ప్రత్యేకంగా డిజైన్ Design చేశారు.
దృష్టిలోపం ఉన్న ప్రయాణికుల కోసం సీటు నంబర్లను బ్రెయిలీ లిపిలో ముద్రించడం మరో విశేషం.ఈ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. వీటిలో 11 థర్డ్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, ఒక ఫస్ట్ ఏసీ కోచ్‌ను ఏర్పాటు చేశారు. మొత్తం 823 బెర్తులు అందుబాటులో ఉండనున్నాయి. దీర్ఘ ప్రయాణంలో అలసట తగ్గేలా బెర్తులను ఎర్గోనామిక్ డిజైన్‌తో, మెరుగైన కుషనింగ్‌తో తయారు చేశారు. శబ్దం, వణుకు తగ్గించేందుకు ఆధునిక సస్పెన్షన్ టెక్నాలజీని ఉపయోగించారు.
వందే భారత్ స్లీపర్‌లో ఆటోమేటిక్ డోర్లు, అత్యవసర పరిస్థితుల్లో నేరుగా సిబ్బందితో మాట్లాడే టాక్‌బ్యాక్ సిస్టమ్, ప్రమాదాలను ముందే గుర్తించి నివారించే ‘కవచ్’ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఇటీవలే కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ పర్యవేక్షణలో ఈ రైలు హైస్పీడ్ ట్రయల్స్‌ను Trails విజయవంతంగా పూర్తి చేసింది. బ్రేకింగ్, స్టెబిలిటీ, సేఫ్టీ వ్యవస్థల పనితీరును అధికారులు సమగ్రంగా పరీక్షించారు. ప్రాథమికంగా వెల్లడైన సమాచారం ప్రకారం, ఆహారంతో కలిపి థర్డ్ ఏసీ టికెట్ ధర సుమారు రూ.2,300, సెకండ్ ఏసీ రూ.3,000, ఫస్ట్ ఏసీ రూ.3,600 వరకు ఉండే అవకాశం ఉంది. మధ్యతరగతి ప్రయాణికులకూ అందుబాటులో ఉండేలా ఈ ఛార్జీలను నిర్ణయించినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి.