Homeక్రీడలుRavichandran Ashwin | అశ్విన్ సంచలన వ్యాఖ్యలు.. తన ఆకస్మిక రిటైర్మెంట్ వెనుక నిజమైన కారణం...

Ravichandran Ashwin | అశ్విన్ సంచలన వ్యాఖ్యలు.. తన ఆకస్మిక రిటైర్మెంట్ వెనుక నిజమైన కారణం ఇదే!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ravichandran Ashwin | టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన ఆకస్మిక రిటైర్మెంట్ వెనుక ఉన్న అసలైన కారణాన్ని తాజాగా వెల్లడించారు.

గతేడాది బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్ట్ తర్వాత ఒక్కసారిగా టెస్ట్ క్రికెట్‌కు (Test Cricket) గుడ్‌బై చెప్పిన అశ్విన్ నిర్ణయం అప్పట్లో అందరినీ షాక్‌కు గురిచేసింది. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై మౌనంగా ఉన్న అశ్విన్, తాజాగా తన యూట్యూబ్ ఛానెల్‌లో (You Tube Channel) టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. అశ్విన్(Ashwin) ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విదేశీ పర్యటనలప్పుడు టీంలో చోటు దక్కక బెంచ్‌కే పరిమితమవ్వడం నాకు విసుగు తెప్పించింది.

Ravichandran Ashwin | అస‌లు కార‌ణం ఇది..

‘జట్టుతో ప్రయాణించి, ఆటలో పాల్గొనలేకపోవడం నన్ను లోలోప‌ల‌ కలిచివేసింది. వయస్సు కూడా పెరుగుతోందని గుర్తించాను. ఇక ఇది సరైన సమయం అనిపించింది’ అని అశ్విన్​ తెలిపారు. “నా పిల్లలతో ఎక్కువ సమయం గడపాలనే కోరిక నాకు ఉంది. వాళ్లు కూడా ఎదుగుతున్నారు. జట్టుకు సహకరించాలనే తపన లేక కాదు. కానీ వ్యక్తిగతంగా జీవితం మరింత విలువైనదని అనిపించింది. ఇక 34-35 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్(Retirement) తీసుకోవాలనే ఆలోచన ఎప్పటినుంచో నాలో ఉంది’ అని స్పష్టం చేశారు. దీంతో అశ్విన్ స‌డెన్‌గా రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డానికి గ‌ల కార‌ణం తెలిసింది.

అశ్విన్ గణాంకాలు చూస్తే.. టెస్ట్ మ్యాచ్‌లు: 106, వికెట్లు: 537. ఇక భారత టెస్ట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా కూడా రికార్డ్ క్రియేట్ చేశాడు. అయితే రాహుల్ ద్రవిడ్‌తో  ఓపెన్ హార్ట్ చిట్‌చాట్ లో చాలానే వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. కెరీర్​పై, భవిష్యత్ ప్రణాళికలపై కూడా ఓపెన్​గా మాట్లాడారు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే, అశ్విన్ రిటైర్మెంట్ వెన‌క అవ‌కాశం రాలేదు అనే ఒక్క కార‌ణం కాకుండా , వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇచ్చే నిర్ణయం కూడా ఉంది అన్న విషయం స్పష్టమవుతోంది. ఒక లెజెండరీ స్పిన్నర్‌కు క్రికెట్ క‌న్నా కూడా తన పిల్లలతో గడిపే క్షణాలే ఎక్కువ విలువైనవిగా అనిపించాయంటే అది నిజంగా అది మనసు తాకే విషయమే అని చెప్పాలి. ఒక‌వేళ అవ‌కాశాలు వ‌చ్చి ఉంటే అశ్విన్ మరి కొద్ది రోజులు క్రికెట్ ఆడేవాడేమో మ‌రి.