అక్షరటుడే,దుండిగల్: Dundigal | ఆశ్లేష నక్షత్రాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ (Hyderabad) దుండిగల్ దత్తపీఠంలో (DathaPeetham) బుధవారం ఆశ్లేషబలి పూజలు (Ashlesha Bali Puja) నిర్వహించారు.
వేదపండితుల ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్య స్వామి పూజలను సైతం ఘనంగా నిర్వహించారు. ఉదయం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి, శేష నాగేంద్ర స్వామికి ప్రత్యేక అభిషేకాలు చేశారు.
అనంతరం ఆలయంలో ప్రత్యేక హోమం నిర్వహించి ఆశ్లేష బలి.. కాలసర్ప దోష నివారణ పూజలు చేశారు. కాలసర్పంలో ‘కాల’ అంటే కాలము అని, ‘సర్పం’ అంటే పాము అని అర్థం.
కాలసర్పం (kalasarpam) అనగా కాలం సర్పంగా మారి మానవుడిని అనేక రకముల కష్టాల పాలు చేయటాన్నే కాలసర్పయోగం లేదా కాలసర్పదోషం అని అంటారని పండితులు సుధీర్ శర్మ వివరించారు.
జన్మకుండలిలో (జాతకచక్రంలో) రాహువు, కేతువు వీటి వల్ల కాలసర్పదోషం ఏర్పడుతుందని తెలియపర్చారు.
Dundigal | కాలసర్ప దోషం..
కాలసర్ప దోషం ఉన్నవారు తమ తమ వృత్తుల్లో పైకి రావడానికి ఎంతో అధికంగా శ్రమ పడాల్సి ఉంటుందన్నారు. మరికొన్నిసార్లు ఎంతలా చమటోడ్చినా.. ఆ శ్రమకు తగిన ఫలితం కనిపించదని పేర్కొన్నారు.
కార్తీకమాసం సందర్భంగా భక్తుల సమస్యలు, ఇబ్బందులు కుజ దోషాలు, సర్ప దోషాలు, నాగ దోషాలు, కాలసర్ప దోషాలు తొలగిపోవాలని విశేష పూజలు నిర్వహించామని పండితుడు వివరించారు.
వివాహ, సంతాన సంబంధమైనటు వంటి ఇబ్బందులు, రుణ బాధలు, రోగ బాధలు, కోర్టు కేసులు అన్ని తొలగిపోవాలని.. భక్తులందరికీ సకల సుఖ భోగాలు కలగాలని సుబ్రమణ్య స్వామికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
