అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ashika Ranganath | ప్రేక్షకులకు వినోదం అందించాల్సిన సినిమా ఇప్పుడు సోషల్ మీడియా ట్రోలింగ్‌కు వేదికగా మారుతోంది. ముఖ్యంగా హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడాపై జరుగుతున్న విమర్శలు టాలీవుడ్‌కే కాదు.. బాలీవుడ్ వరకూ విస్తరించాయి.
ఈ నేపథ్యంలో తాజాగా మాస్ మహారాజా రవితేజ (Maharaja Ravi Teja)తో నటించిన హీరోయిన్ ఆషికా రంగనాథ్ తనపై, అలాగే సినిమా యూనిట్‌పై జరుగుతున్న ట్రోలింగ్‌కు ఘాటుగా స్పందించారు. రవితేజ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV Cinemas), జీ స్టూడియోస్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలకు సిద్ధమవుతోంది.
Ashika Ranganath | ఫుల్ క్లారిటీ..
అయితే ఈ సినిమాలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడాపై సోషల్ మీడియా (Social Media)లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రవితేజ వయసు 57 ఏళ్లు కాగా.. ఆషికా రంగనాథ్ 29, డింపుల్ హయాతి 27 ఏళ్లు కావడంతో ట్రోలింగ్ మొదలైంది. గతంలో ‘ధమాకా’, ‘మిస్టర్ బచ్చన్’ సినిమాల సమయంలోనూ రవితేజ ఇలాంటి విమర్శలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.ఇటీవల హైదరాబాద్ (Hyderabad)లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఇదే అంశంపై ఆషికా రంగనాథ్‌ను విలేకరులు ప్రశ్నించారు. దీనికి ఆమె ఎంతో స్పష్టంగా, ఆత్మవిశ్వాసంతో సమాధానం ఇచ్చారు.నేను నా పనిని ఒక నటిగా మాత్రమే చూస్తాను. విభిన్నమైన పాత్రలు చేయడమే నా లక్ష్యం. ఈ సినిమాలో నా క్యారెక్టర్ యంగ్ అండ్ మోడరన్‌గా ఉంటుంది. గతంలో నాగార్జున గారితో ‘నా సామి రంగ’లో పరిణితి చెందిన పాత్ర చేశాను.
నా సహనటుడి వయసు నా నిర్ణయాన్ని ప్రభావితం చేయదు. నేను ఆ పాత్రకు ఎంత వరకు సెట్ అవుతాను, ఆ పాత్ర కథకు ఎంతగా దోహదపడుతుంది అనేదే నాకు ముఖ్యం. అది యంగ్ హీరో సినిమా అయినా, సీనియర్ హీరో సినిమా అయినా నాకు తేడా లేదు” అని ఆమె వ్యాఖ్యానించారు. ఆషికా రంగనాథ్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నటనలో వయసుకంటే పాత్రకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆమె మాటలకు సినీ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. మరోవైపు ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది.