అక్షరటుడే, వెబ్‌డెస్క్: Asaduddin owaisi | తమ దగ్గర అణుబాంబులు ఉన్నాయని, అరగంటలో భారత్‌పై దాడి చేయగలమని పాక్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్(MP Asaduddin) స్పందించారు. పాకిస్తాన్ నేతలకు(Pakistani leaders) తనదైన రీతిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
మహారాష్ట్రలో జరిగిన బహిరంగ సభలో ఒవైసీ(owaisi) ప్రసంగించారు. ఈ సందర్భంగా పాక్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘భారత్ కంటే పాకిస్తాన్ అర్ధ శతాబ్దం వెనుకబడి ఉంది. మీ బడ్జెట్, తమ సైనిక బడ్జెట్‌కు కూడా సమానం కాదు. పాక్ తమ వద్ద న్యూక్లియర్ బాంబులు (Nuclear Bombs) ఉన్నాయని పదేపదే చెబుతోంది. మీరు వేరే దేశంలోకి వెళ్లి అమాయక ప్రజలను చంపితే, ఏ దేశమూ ఊరుకోదు’ అని హెచ్చరించారు.
‘పహల్గామ్(Pahalgam) పర్యాటకులను చంపే ముందు ఉగ్రవాదులు మతాన్ని అడిగారు. ఈ చర్య మీరు ఐఎస్ఐఎస్(ISIS) వారసులని చెబుతోంది’ అని ఒవైసీ మండిపడ్డారు. భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని, పాక్ ఏళ్లుగా ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోందన్నారు.
పాకిస్థాన్‌ను ఆర్థికంగా మరింత బలహీనం చేసేందుకు ప్రధాని మోదీ(Prime Minister Modi) చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘టీవీ ఛానల్స్‌లో కొందరు యాంకర్లు కశ్మీర్ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అది సరికాదు. కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం. కశ్మీర్ (Kashmir) ప్రజలు భారతీయులే. వారిని మనం ఎలా అనుమానించగలం?’ అని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు అర్పించిన ఓ వ్యక్తి కశ్మీరీ, గాయపడిన ఓ పిల్లవాడిని రక్షించిన వ్యక్తి కశ్మీరీ’ అని అసద్ పేర్కొన్నారు.