అక్షరటుడే, వెబ్డెస్క్ : Terror Attack | పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam terror attack)పై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై ఆయన స్పందిస్తూ.. ఇంత మంది పర్యాటకులు ఉన్న ప్రదేశంలో ఒక్క పోలీసు సిబ్బంది, సీఆర్పీఎఫ్ crpf శిబిరం ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. క్విక్ రియాక్షన్ టీం(QRT) ఘటనా స్థలానికి చేరుకోవడానికి గంటకు పైగా పట్టిందన్నారు. పాకిస్తాన్ pakistan నుంచి వచ్చిన ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారని, పాక్ వారికి మద్దతు ఇస్తోందని పేర్కొన్నారు. అయితే వారు సరిహద్దు(boarder)ను ఎలా దాటారని ఓవైసీ ప్రశ్నించారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారన్నారు. ఉగ్రదాడిని తాము ఖండిస్తున్నట్లు తెలిపారు.
Terror Attack | ఉగ్రదాడిపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Advertisement -
