Terror Attack | పాక్​ క్రికెటర్​పై అసదుద్దీన్​ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
Terror Attack | పాక్​ క్రికెటర్​పై అసదుద్దీన్​ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terror Attack | జమ్మూ కశ్మీర్​ jammu kashmir లోని పహల్గామ్ pahalgam​లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిపై ప్రపంచ దేశాలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశాయి. అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్​కు చెందిన పలువురు మాత్రం ఈ ఘటనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.

పాక్​ ఉప ప్రధాని ఉగ్రవాదులను స్వాతంత్య్ర సమరయోధులుగా అభివర్ణించిన విషయం తెలిసిందే. ఇటీవల పాక్​ మాజీ క్రికెటర్​ షాహీద్​ అఫ్రిది shahid afridi సైతం నోటీ దురుసు వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్‌లో టపాసులు పేలినా భారత్‌ కాశ్మీర్‌పై నిందలు వేస్తోందని.. భారత్‌ పాకిస్థాన్‌పై నిందలు వేయడం మానేసి..ఉగ్రదాడికి సంబంధించి సాక్ష్యాలను చూపాలని వ్యాఖ్యానించారు. అంతేగాకుండా భారత బలగాల చేతకాని తనంలో ఉగ్రదాడి జరిగిందన్నారు.

దీనిపై తాజాగా మజ్లీస్‌ పార్టీ చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ asaduddin owaisi తీవ్రంగా మండిపడ్డారు. అఫ్రిది ఒక జోకర్​ అని, అలాంటి జోకర్ల పేర్లను తన ముందు తీసుకురావొద్దని వ్యాఖ్యానించారు. ఎందుకు పనికిరాని వాళ్ల గురించి మాట్లాడడం వేస్ట్ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.