అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jubilee Hills by-election | ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్‌కు మద్దతు తెలిపారు. కాంగ్రెస్‌ను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav) శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ర్యాలీగా వెళ్లి ఆయన మొదటి సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా షేక్‌పేట్ ఆర్ఓ కార్యాలయం సమీపంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీని నవీన్ యాదవ్ కలిశారు. ఒవైసీ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచి అన్ని వర్గాలను కలుపుకుని ముందుకెళ్లాలని ఆయనకు సూచించారు.
Jubilee Hills by-election | బీఆర్ఎస్ విఫలం
ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ (BRS) పదేళ్ల పాలనలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే జూబ్లీహిల్స్‌లో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. తాము జూబ్లీహిల్స్‌లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 37 శాతం ఓట్లు వచ్చాయని, పార్లమెంట్ ఎన్నికల్లో 15 శాతానికి పడిపోయాయన్నారు. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి వెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను ఆపాలని ఒవైసీ అన్నారు.
Jubilee Hills by-election | బీజేపీ ఆరోపణల వేళ..
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ తరఫున ఎంఐఎం అభ్యర్థి పోటీ చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు (BJP President) రామచందర్‌రావు ఇటీవల ఆరోపించారు. ఈ క్రమంలో నవీన్ యాదవ్‌కు ఒవైసీ మద్దతు తెలపడం గమనార్హం. కాగా నవీన్ యాదవ్ తన రాజకీయ జీవితాన్ని ఎంఐఎంతో ఆరభించారు. 2014లో జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయారు. ఈ క్రమంలో తాజాగా ఎంఐఎం అధినేత ఆయనకు మద్దతు తెలపడం గమనార్హం.
Jubilee Hills by-election | ప్రజాభిప్రాయం మేరకే..
నామినేషన్ అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీఆర్ఎస్ ఓట్ చోరీ పేరిట ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తాము రెండేళ్లలో చేసిన అభివృద్ధిని చెప్పి ఓట్లు అడుగుతామన్నారు. ప్రజాభిప్రాయం మేరకే నవీన్ యాదవ్‌కు టికెట్ అధిష్టానం టికెట్ కేటాయించిందని చెప్పారు. నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. తనకుకు టికెట్ ఇచ్చిన పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు.