HomeతెలంగాణAsaduddin Owaisi | లోకేష్ భ‌విష్య‌త్‌ని నాశ‌నం చేస్తున్న చంద్ర‌బాబు..టీడీపీని జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగిస్తారా?

Asaduddin Owaisi | లోకేష్ భ‌విష్య‌త్‌ని నాశ‌నం చేస్తున్న చంద్ర‌బాబు..టీడీపీని జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగిస్తారా?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Asaduddin Owaisi | టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును (Nara Chandra babu Naidu) టార్గెట్ చేస్తూ.. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేయ‌డం ఇప్పుడు చ‌ర్చనీయాంశంగా మారంది. తెలుగుదేశం పార్టీ ఎంతో తనకు ఎంతో గౌరవమని, తనకు చాలా మంది సన్నిహితులు ఆ పార్టీలో ఉన్నారని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ అన్నారు. అయితే టీడీపీ బాధ్యతల నుంచి చంద్రబాబు తప్పుకుని, యువనేత నారా లోకేష్‌(Nara Lokesh)కు బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుంద‌ని ఏపీ సీఎంకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) సూచించారు. తన కుమారుడు లోకేష్ జీవితాన్ని చంద్రబాబు నాశనం చేస్తున్నారని, దయచేసి తాను చేసే సూచనను పాటించాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Asaduddin Owaisi | స్ట‌న్నింగ్ కామెంట్స్

చంద్రబాబు తన కంటే, తన పార్టీ కంటే లోకేష్ కు ఎక్కువ నష్టం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఎలాగో తన తర్వాత కుమారుడు లోకేషే పార్టీ పగ్గాలు తీసుకుంటాడు కదా, జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) అయితే ఆ పదవికి పోటీ రాడు కదా అని ఓవైసీ వ్యాఖ్యానించారు. కర్నూలులో వక్ఫ్ బోర్డు, వక్ఫ్ భూముల గురించి జరిగిన కార్యక్రమంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పాల్గొని ప్రసంగిస్తూ ఈ కామెంట్స్ చేశారు. లోకేష్‌కు తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party)ని అప్పగించాలని ఏపీ సీఎం చంద్రబాబుకు అసదుద్దీన్ ఒవైసీ సూచించారు. లోకేష్ జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు, ఎలాగూ మీరు జూనియర్ ఎన్టీఆర్‌కు టీడీపీ పగ్గాలు అప్పగించే అవకాశం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎత్తడంతోనే అక్కడున్న వారు గట్టిగా అరవడంతో అసదుద్దీన్ షాకయ్యారు.

జూనియర్ ఎన్టీఆర్‌కు అంత పాపులారిటీ ఉందా, నాకు తెలియదని వ్యాఖ్యానించారు. టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్ చేపట్టే ఛాన్స్ ఉందా అన్నారు. చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత అని, గతంలో సీఎంగా తొమ్మిదేళ్లు, విపక్ష నేతగా పదేళ్లు పనిచేశారని గుర్తుచేశారు. అటువంటి వ్యక్తి లోకేష్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని ఓవైసీ సూచించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్, కుమారస్వామి లాంటి వాళ్లకు పిల్లలపై ప్రేమ, వారి భవిష్యత్ కోరుకుంటే యువతకు అవకాశం ఇవ్వాలి. మా భూములు మా ఇష్టం, మాకు నచ్చింది చేసుకుంటాం. దానిపై మీకు హక్కు ఏముంది. మీ పిల్లలనే మీరు నమ్మనప్పుడు వక్ఫ్ బోర్డు లాంటివి ఏం నమ్ముతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ హిందూత్వ అజెండాతో వస్తే, చంద్రబాబు వస్తారా, నితీష్ కుమార్, చిరాగ్ పాశ్వాన్, జయంత్ చౌదరి వచ్చి మాకు మద్దతుగా నిలుస్తారా అని ప్రశ్నించారు. హిందూ ఆలయాలు, బోర్డుల్లో అన్య మతస్తులు ఉండరాదని చెప్పే మీరు, వక్ఫ్ బోర్డుల్లో, మా దర్గా టీమ్స్ లో ముస్లిమేతరులు ఎందుకు ఉండాలి. హిందువులకో న్యాయం, ముస్లింలకు ఓ న్యాయమా అని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.