HomeUncategorizedAs Ravi kuamr Chowdary | గుండె పోటుతో క‌న్నుమూసిన టాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు.. సంతాపం...

As Ravi kuamr Chowdary | గుండె పోటుతో క‌న్నుమూసిన టాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు.. సంతాపం తెలిపిన ప్ర‌ముఖులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :As Ravi kuamr Chowdary | టాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఏఎస్ ర‌వి కుమార్ (As Ravi kuamr Chowdary) జూన్ 10 రాత్రి గుండెపోటుతో క‌న్నుమూసారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న మంగ‌ళ‌వారం రాత్రి గుండెపోటుతో తుది శ్వాస విడిచిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న హ‌ఠాన్మ‌ర‌ణంతో టాలీవుడ్‌(Tollywood)లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. ఆయ‌న మృతికి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు. గోపీచంద్ కథానాయకుడిగా ఈ తరం ఫిలిమ్స్ పతాకం మీద పోకూరి బాబురావు నిర్మించిన ‘యజ్ఞం’తో రవికుమార్ చౌదరి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ మూవీ విజ‌యంతో ఏకంగా బాల‌య్య సినిమా చేసే ఛాన్స్ ద‌క్కింది.

As Ravi kuamr Chowdary | హఠాన్మ‌ర‌ణం..

బాలకృష్ణతో Bala Krishna ‘వీరభద్ర’ సినిమా చేయ‌గా, అది ఆశించిన ఫలితం ఇవ్వలేదు. నితిన్ హీరోగా చేసిన ‘ఆటాడిస్తా’ కూడా డిజాస్టర్ అయ్యింది.‌ ఆ తరువాత ‘ఏం పిల్లో ఏం పిల్లడో ‌’ కాస్త ఊరట ఇచ్చింది.సుప్రీం స్టార్, మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ కథానాయకుడిగా ‘పిల్లా నువ్వు లేని జీవితం’తో మళ్లీ రవికుమార్ చౌదరి భారీ విజయం అందుకున్నారు.‌ ఆ తర్వాత తన తొలి సినిమా హీరో గోపీచంద్‌తో మరో సినిమా చేశారు. అదే ‘సౌఖ్యం’. అది కూడా ఆశించిన విజయం సాధించలేదు. ఫ్లాప్ అయ్యింది.‌ ఇటీవల రాజ్ తరుణ్ హీరోగా ‘తిరగబడరా సామి’ సినిమాకు రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించ‌గా, ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది.ఇలా కెరీర్‌లో అప్ అండ్ డౌన్స్ రావ‌డంతో మాన‌సికంగా ఒత్తిడికి లోనై మద్యానికి బానిస అయినట్టు సన్నిహితుల నుంచి అందుతోన్న సమాచారం.

ప్రస్తుతం దర్శకత్వానికి Direction దూరంగా ఉన్న ఆయన హఠాన్మరణం తెలుగు చిత్ర పరిశ్రమని కలచి వేస్తుంది. ఆయన మృతిపట్ల ఇండస్ట్రీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంది. అయితే గత కొంత కాలంగా ఏఎస్‌ రవికుమార్‌ తన కుటుంబానికి దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ఫ్యామిలీలో గొడవలు ఉన్న నేపథ్యంలో చాలా కాలంగా ఒంటరిగానే ఉంటున్నారు. అలా ఆయ‌న బాగా కుంగిపోయార‌ని అంటున్నారు. ర‌వి కుమార్ మృతికి గ‌ల పూర్తి కార‌ణాలు తెలియాల్సి ఉంది.