అక్షరటుడే, ఎల్లారెడ్డి: Arya Vysya Association: అన్ని రంగాల్లో అభివృద్ధికి వైశ్యులు కీలకమని, అభివృద్ధిలో వారి పాత్ర ఎంతో ఉంటుందని ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు అన్నారు. ఎల్లారెడ్డి మండల ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారోత్సవం శనివారం స్థానిక ముత్యపు రాఘవులు పెంటయ్య ఫంక్షన్ హాల్లో అట్టహాసంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైశ్యులు నిజాయితీగా వ్యాపారాలు చేస్తారని అభినందించారు. సమాజంలో వారి పాత్ర ఎంతో ఉందన్నారు. ఎల్లారెడ్డి అభివృద్ధి చెందుతుందంటే వారి పాత్ర ఎంతో ఉందన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా శాసనసభ్యులు మదన్ మోహన్ రావు పేర్కొన్నారు. ఆర్య వైశ్యులకు ఏ సమస్య వచ్చినా తాను అండగా నిలబడతానని హామీ ఇచ్చారు.
దానధర్మాల్లోనూ వారి పాత్ర ఎంతో ఉంటుందన్నారు. సమాజంలో మంచి జరిగే ప్రతి కార్యక్రమంలో వైశ్యులు ముందుంటారని పేర్కొన్నారు . ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు.
Arya Vysya Association : ఎమ్మెల్యేకు ఘన స్వాగతం
ఆర్యవైశ్య సంఘం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్‌కు ఛైర్మన్ సిద్ది శ్రీధర్ గుప్తా గజమాలతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పై పూల వర్షం కురిపించారు. వేద పండితులు రాజు పంతులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకొని పట్టణంలో ప్రధాన రహదారిపై భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావును ఆర్య సంఘం మండల అధ్యక్షులు సిద్ది శ్రీధర్,స్నేహ, పిల్లలు రామ్ సాయి, స్నిక్ష మెమొంటో శాలువాలు, గజమాలతో సత్కరించారు. చిన్నారులు ముస్త్యాల ప్రహర్షి, ముస్త్యాల ప్రశస్థి శివై ఎమ్మెల్యేకు రాధాకృష్ణ ఫొటోతో కూడిన మెమొంటో అందజేయగా.. ఎమ్మెల్యే వారిని అభినందించారు.
Arya Vysya Association : ప్రమాణ స్వీకారం చేసిన నూతన పాలకవర్గం
ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు కంచర్ల బాలకిషన్ గుప్తా.. మండల నూతన అధ్యక్షుడు సిద్ది శ్రీధర్ గుప్తా, ప్రధాన కార్యదర్శి ఓరవిటల్ గుప్తా, కోశాధికారి సాయినాథ్ గుప్తాలచే ప్రమాణ స్వీకారం చేయించారు.
ఉపాధ్యక్షులు, సంయుక్తా కార్యదర్శిలు, పీఆర్వోలు, కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య రాష్ట్రస్థాయి నాయకులు కైలాస శ్రీనివాసరావు గుప్తా, వంగపల్లి నాగభూషణం గుప్తా, యాద నాగేశ్వరరావు గుప్తా, ముత్యపు వీరేశలింగం గుప్తా, కంచర్ల లింగం గుప్తా, గౌరీ శంకర్ గుప్తా, భూమేష్ గుప్తా, కొక్కొండ రవీందర్ గుప్తా, లింగంపేట్ సర్పంచ్ రవి గుప్తా, ముంబాజిపేట్ సర్పంచి నరసింహులు గుప్తాతో పాటు డివిజన్లోని ఆర్యవైశ్య మండల అధ్యక్షులు, పట్టణంలోని ప్రముఖులు, ఆర్యవైశ్య మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.