ePaper
More
    Homeలైఫ్​స్టైల్​Artificial intelligence | 18 ఏళ్ల కలను నెరవేర్చిన కృత్రిమ మేధ.. తల్లిదండ్రులు కావాలన్న ఓ...

    Artificial intelligence | 18 ఏళ్ల కలను నెరవేర్చిన కృత్రిమ మేధ.. తల్లిదండ్రులు కావాలన్న ఓ జంట ముచ్చట తీర్చేలా సాయం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Artificial intelligence | తల్లిదండ్రులు కావాలని 18 సంవత్సరాలుగా నిరీక్షిస్తున్న ఓ జంట కోరికను కృత్రిమ మేధ నెరవేర్చింది. పండంటి బిడ్డను కనాలని ప్రయత్నిస్తున్న ఆ జంటకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోడుగా నిలిచింది. ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ (in vitro fertilization) ప్రయత్నాలు ఫలించని దశలో.. గర్భం దాల్చడానికి కృత్రిమ మేధ సహాయపడిందని సీఎన్ ఎన్ వెల్లడించింది. పేరు వెల్లడించడానికి ఇష్టపడని సదరు జంట చేసిన ప్రయత్నాలను వివరించింది.

    Artificial intelligence | ఫలించని ఐవీఎఫ్

    18 సంవత్సరాల క్రితం పెళ్లయిన జంటకు ఎంతకీ సంతాన భాగ్యం కలుగలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించలేదు. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ IVF కేంద్రాలను సంప్రదించినా గర్భం దాల్చలేదు. అజోస్పెర్మియా అనే అరుదైన పరిస్థితి కారణంగా IVF ప్రయత్నాలు విఫలమయ్యాయి. భర్త వీర్యంలో నిర్దేశిత స్థాయంలో స్పెర్మ్ కణాలు లేకపోవడమే ఇందుకు కారణం. ఆరోగ్యకరమైన వీర్య నమూనాలో మిల్లీలీటర్​కు మిలియన్ల స్పెర్మ్ కణాలు (sperm cells per milliliter) ఉంటాయి. కానీ, భర్తకు ఆ స్థాయిలో లేవు.

    Artificial intelligence | దారి చూపిన ఏఐ

    ఎన్ని ప్రయత్నాలు చేసినా పండంటి బిడ్డను కనాలన్న ప్రయత్నాలు విఫలం కావడంతో ఆ జంట నిరాశకు గురైంది. చివరకు కొలంబియా యూనివర్సిటీ ఫెర్టిలిటీ సెంటర్ (సీయూఎఫ్​సీ) వైపు మొగ్గు చూపారు. ఈ సంతానోత్పత్తి కేంద్రంలోని పరిశోధకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సదరు జంట సమస్య ఏమిటో, పరిష్కారం ఏమిటో కనుగొన్నారు. పురుషులలో దాచిన స్పెర్మ్​ను గుర్తించడానికి కృత్రిమ మేధను ఉపయోగించే స్పెర్మ్ ట్రాకింగ్ అండ్ రికవరీ (Sperm Tracking and Recovery) పద్ధతిని పాటించారు. ఈ విధానం ఫలించడంతో సదరు జంట 18 సంవత్సరాల నిరీక్షణకు తెర పడింది.

    Artificial intelligence | తొలిసారి స్టార్ పద్ధతి వినియోగం..

    కొలంబియా వర్సిటీ సంతానోత్పత్తి కేంద్రంలోని (Columbia University Fertility Center) పరిశోధకులు AI-ఆధారిత వ్యవస్థతో వీర్య నమూనాపై పరిశోధనలు చేశారు. కృత్రిమ మేధ సాయంతో ఎట్టకేలకు దాచిన స్పెర్మ్​ను కనుగొనగలిగారు. తిరిగి పొందిన స్పెర్మ్​ను ఐవీఎఫ్ ద్వారా భార్య అండాన్ని ఫలదీకరణం చేయడానికి దీనిని ఉపయోగించారు. ఈ ప్రయోగం ఫలించి ఆమె గర్భవతి అయింది. స్టార్ పద్ధతిని ఉపయోగించి గర్భం దాల్చిన మొట్టమొదటి మహిళగా ఆమె నిలిచింది. “నేను గర్భవతినని నమ్మడానికి నాకు రెండు రోజులు పట్టింది” అని ఆ మహిళ చెప్పింది. ఇది నిజమో కాదో ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని, స్కానింగ్​లను చూసే వరకు నేను గర్భవతినని నమ్మనని తెలిపారు.

    Artificial intelligence | STAR పద్ధతి

    CUFC డైరెక్టర్ డాక్టర్ జెవ్ విలియమ్స్ (CUFC director Dr. Zev Williams) మరియు అతని సహచరులు ఐదు సంవత్సరాల పరిశోధన తర్వాత STAR పద్ధతిని అభివృద్ధి చేశారు. ఈ సరికొత్త విధానం నిజ జీవితంలో ఇచ్చిన ఫలితాలను చూసి పరిశోధకుల కూడా ఆశ్చర్యపోయింది. “ఒక రోగి ఒక నమూనాను అందించాడు. ఆ నమూనా ద్వారా స్పెర్మ్​ను కనుగొనడానికి అత్యంత నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు రెండు రోజులు వెతికారు. వారు ఏదీ కనుగొనలేదు. మేము దానిని AI- ఆధారిత STAR సిస్టమ్​కు తీసుకువచ్చాం. ఒక గంటలో, అది 44 స్పెర్మ్​ను కనుగొంది. కాబట్టి వెంటనే, మేము గ్రహించాము, ‘వావ్, ఇది నిజంగా గేమ్-ఛేంజర్. ఇది రోగులకు చాలా పెద్ద తేడాను కలిగిస్తుంది’ అని పరిశోధన బృందానికి నాయకత్వం వహించిన మిస్టర్ విలియమ్స్ అన్నారు.

    More like this

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...