Homeజిల్లాలునిజామాబాద్​Arthritis Day | ఆర్థరైటిస్​ను త్వరగా గుర్తిస్తే నియంత్రణ సాధ్యమే..

Arthritis Day | ఆర్థరైటిస్​ను త్వరగా గుర్తిస్తే నియంత్రణ సాధ్యమే..

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెడికవర్‌ హాస్పిటల్స్​లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వైద్యులు మాట్లాడుతూ ఆర్థరైటిస్​ను ముందుగా గుర్తిస్తే నివారణ సాధ్యమేనన్నారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Arthritis Day | ఆర్థరైటిస్​ను త్వరగా గుర్తిస్తే నియంత్రణ సాధ్యమవుతుందని మెడికవర్​ ఆస్పత్రి (Medicover Hospital) ఆర్థోపెడిక్​ సర్జన్​ మణిదీప్​రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 12న ఆదివారం ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెడికవర్‌ హాస్పిటల్స్​లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ మేరకు ఆర్థోపెడిక్ సర్జన్​ డా.మణిదీప్ రెడ్డి మాట్లాడుతూ కీళ్లనొప్పులు వృద్ధాప్యానికి మాత్రమే పరిమితం కావట్లేదన్నారు. ఆధునిక జీవనశైలిలో వ్యాయామం లోపం, అధిక బరువు, ఒత్తిడి కారణంగా యువతలో కూడా ఆర్థరైటిస్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయన్నారు. భారత్​లోనే సుమారు 18కోట్ల మందికి పైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా వేశారు.

ఆర్థరైటిస్‌ అనేది కీళ్లలో వాపు (joints Swelling), నొప్పి, గట్టిపడడం కలిగించే వ్యాధి అని దీంతో ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయన్నారు. ఆస్టియో ఆర్థరైటిస్‌ (Osteoarthritis) ఇది కీళ్ల కండరాలు దెబ్బతినడం వల్ల వస్తుందని, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ (Rheumatoid arthritis) ఇది శరీర రోగనిరోధక వ్యవస్థ పొరపాటుగా కీళ్లను దాడి చేసే ఆటోఇమ్యూన్‌ వ్యాధి అన్నారు. తొలిదశలో గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే కీళ్ల దెబ్బతినడం నివారించవచ్చని, కీళ్లనొప్పులు, వాపు, ఉదయం గట్టిపడడం వంటి లక్షణాలు రెండు వారాలకు మించి కొనసాగితే వైద్యుడిని సంప్రదించాలని తెలిపారు.

అనంతరం డా. రామకోటేశ్వర రావు ఆర్థోపెడిక్ సర్జన్ మాట్లాడుతూ తగిన బరువును కాపాడుకోవడం, ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, స్వచ్ఛందంగా మందులు వాడకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి నియంత్రణలో ఉంటుందని స్పష్టం చేశారు. ఆధునిక వైద్య పద్ధతులు, కీళ్ల పునరుద్ధరణ శస్త్రచికిత్సలు ద్వారా ఆర్థరైటిస్‌ రోగులు కూడా సుఖమైన జీవితం గడపవచ్చన్నారు.