అక్షరటుడే, ఇందల్వాయి: Telangana University | సమాజాన్ని కళలు తీవ్రంగా ప్రభావితం చేస్తాయని తెలంగాణ యూనివర్సిటీ (Telangana University) రిజిస్ట్రార్ యాదగిరి పేర్కొన్నారు.
వర్సిటీలో కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ సెమినార్ హాల్లో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మండలి ఆధ్వర్యంలో కళాకారుల ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమానికి వైస్ప్రిన్సిపల్ ప్రొఫెసర్ లక్ష్మణ చక్రవర్తి (Vice Principal Professor Lakshmana Chakravarthy)అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. కళాకారులు తమ కళారూపాల ద్వారా ప్రజల హృదయాలను తట్టి లేపుతారన్నారు. విద్యార్థులు నేడు మితిమీరిన సాంకేతికత పరిజ్ఞానం పేరుతో తప్పుదోవ పట్టే అవకాశం ఉందని.. వారికి కళారూపాల్లోనే అవగాహన కల్పిస్తే బాగుంటుందని ఆయన పేర్కొన్నారు. సీఐ వినోద్ మాట్లాడుతూ యువత సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో సైబర్మోసగాళ్ల (cyber fraudsters) చేతుల్లో మోసపోతున్నారన్నారు. సబ్ ఇన్స్పెక్టర్ షరీఫ్ (Sub Inspector Sharif) మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం ఒకసారి ప్రారంభమైతే అవి వారిని బానిసలుగా మార్చుకుంటాయన్నారు. యువత ఈ మధ్యకాలంలో ఎంజాయ్ పేరుతో గంజాయిని సేవిస్తున్నారన్నారు.
అనంతరం కళాకారుల బృందం ఆట పాటల ద్వారా, నాటికల ద్వారా గంజాయితో కలిగే నష్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త ప్రొఫెసర్ అపర్ణ, తెలంగాణ ప్రజానాట్యమండలి అధ్యక్షుడు శ్రీనివాస్, పీఆర్వో ఏ పున్నయ్య, శ్రీధర్ బట్టు, రఘురాం, రెహమాన్, సంజీవ్ పాల్గొన్నారు.
