Homeతాజావార్తలు#ArriveAlive రోడ్డు భద్రతపై అరైవ్​ అలైవ్​ పేరుతో అవగాహన ప్రచారం : డీజీపీ

#ArriveAlive రోడ్డు భద్రతపై అరైవ్​ అలైవ్​ పేరుతో అవగాహన ప్రచారం : డీజీపీ

#ArriveAlive| ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాలలో మరణించే వారి సంఖ్య హత్య సంఘటనలలో మరణించే వారి కంటే సుమారు పది రెట్లు ఎక్కువగా ఉంటోందని డీజీపీ శివధర్​ రెడ్డి తెలిపారు. 

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: #ArriveAlive| ప్రతి సంవత్సరం హత్య సంఘటనలలో మరణించే వారి కంటే రోడ్డు ప్రమాదాల (road accidents) లో చనిపోయే వారి సంఖ్య సుమారు పది రెట్లు ఎక్కువగా ఉంటోందని డీజీపీ శివధర్​ రెడ్డి DGP Shivdhar Reddy తెలిపారు.

రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రతపై అవగాహన ప్రచారం నిర్వహించేందుకు అరైవ్​ అలైవ్​ కార్యక్రమం Arrive Alive program చేపట్టబోతున్నట్లు డీజీపీ పేర్కొన్నారు.

సీనియర్ పోలీసు అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రోడ్డు భద్రతా నిపుణులతో నిర్వహించిన సమావేశంలో డీజీపీ మాట్లాడారు.

రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడానికి డిసెంబరు నెలలో రాష్ట్రవ్యాప్తంగా 15 రోజుల పాటు “అరైవ్ అలైవ్” ప్రచారాన్ని నిర్వహించనున్నట్లు డీజీపీ శివధర్​ రెడ్డి తెలిపారు.

#ArriveAlive | 16న ప్రపంచ రోడ్డు ట్రాఫిక్ బాధితుల సంస్మరణ డే

నవంబర్ 16న నిర్వహించుకునే ప్రపంచ రోడ్డు ట్రాఫిక్ బాధితుల సంస్మరణ డేకు World Day of Remembrance for Road Traffic Victims సంబంధించి ఈ కార్యక్రమాన్ని రూపొందించనున్నట్లు ఆయన చెప్పారు.

రోడ్డు భద్రత గురించి పౌరులలో అవగాహన పెంచడం, ట్రాఫిక్ నియమాలను కఠినంగా పాటించడం, బాధ్యతాయుతమైన, రక్షణాత్మక డ్రైవింగ్ అలవాట్లను ప్రోత్సహించడం, చివరికి ప్రమాదాలను తగ్గించడం ఈ చొరవ యొక్క ప్రధాన లక్ష్యమని వివరించారు.

“సజీవంగా చేరుకోండి” అనే ప్రచారాన్ని ప్రజా ఉద్యమంగా చేపట్టాలని అన్ని విభాగాలు, సంస్థలకు డీజీపీ పిలుపునిచ్చారు.

ఈ ప్రచారాన్ని విజయవంతం చేయడానికి పోలీసు శాఖ police department, రవాణా శాఖ transport department, కార్పొరేట్ సంస్థలు corporate bodies, విద్యాసంస్థలు educational institutions, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.

రోడ్డు భద్రతలో ఇతర చోట్ల అవలంబించే ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయాలని, తెలంగాణకు అనువైన అమలు చేయగల వ్యూహాలను అభివృద్ధి చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

వాహన డ్రైవర్ల కోసం “సేఫ్టీ కనెక్ట్” Safety Connect అనే కృత్రిమ మేధస్సు ఆధారిత మొబైల్ అప్లికేషన్‌ను సిఫార్సు చేశారు. ఈ యాప్ డ్రైవింగ్ ప్రవర్తనను పర్యవేక్షిస్తుందన్నారు.

రోడ్డు భద్రతా నియమాలపై అవగాహనను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ ప్రచారంలో విస్తృత ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ArriveAliveTG వంటి ప్రత్యేక హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించాలని NGO సభ్యులు సూచించారు.

రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో ప్రజల భాగస్వామ్యం, అవగాహన, రోడ్డు భద్రతా నియమాల అమలు – రక్షణాత్మక డ్రైవింగు చాలా కీలకమని డీజీపీ పునరుద్ఘాటించారు.

Must Read
Related News