Homeజిల్లాలునిజామాబాద్​Excise Department | మత్తుపదార్థాలు రవాణా చేస్తున్న ఒకరి అరెస్ట్

Excise Department | మత్తుపదార్థాలు రవాణా చేస్తున్న ఒకరి అరెస్ట్

- Advertisement -

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Excise Department | అల్ప్రాజోలం రవాణా చేస్తున్న ఒకరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రొడక్షన్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు బుధవారం ఎక్సైజ్​ ఇన్​స్పెక్టర్​ స్వప్న ఆధ్వర్యంలో నిజామాబాద్ పట్టణంలోని గోశాల రోడ్డులో (Goshala Road) ఎక్సైజ్ పోలీసులు (Excise Police) సోదాలు నిర్వహించారు.

పట్టణంలోని కోజా కాలనీకి చెందిన అబ్దుల్ మాలిక్ దేవాని టాల్కమ్ పౌడర్ (Talcum powder) తయారీలో ఉపయోగించే 609 గ్రాముల అల్ప్రాజోలం పదార్థాన్ని అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఈఎస్​ విలాస్ తెలిపారు. ఈ దాడిలో ఎన్‌ఫోర్స్‌మెంట్​ అధికారులు విలాస్​, రాంకుమార్, రాజన్న, నారాయణ రెడ్డి, సిబ్బంది హమీద్, శివ, శ్యాంసుందర్​ తదితరులు పాల్గొన్నారు.