అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Cp Sai Chaitanya | ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేలా ఏర్పాట్లు చేయాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) సూచించారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు (Gram Panchayat elections) నిజామాబాద్ డివిజన్ పరిధిలో జరగనున్న నేపథ్యంలో శుక్రవారం డిచ్పల్లి సర్కిల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
Cp Sai Chaitanya | ఎన్నికల నియమావళిని తప్పక పాటించాలి..
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని తూ.చా. తప్పకుండా పాటించాలని సూచించారు. ప్రధానంగా నిజామాబాద్ డివిజన్ పరిధిలో ఉన్న సమస్యాత్మకమైన, అతిసమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లను గుర్తించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చూడాలని ఆదేశించారు.
Cp Sai Chaitanya | మార్కింగ్ వేయాలి
ప్రతీ పోలింగ్ కేంద్రానికి (polling station) నిర్దిష్ట దూరంలో మార్కింగ్ చేయించి, ప్రచారం, గుర్తులను ప్రదర్శించకుండా నివారించాలని సీసీ సూచించారు. అవసరాన్ని బట్టి స్ట్రైకింగ్ ఫోర్స్ సేవలను వినియోగించుకొని గుంపులను చెదర గొట్టాలని అన్నారు. ఎన్నికలను ప్రభావితం చేసే డబ్బు, మద్యం, మరే ఇతర అక్రమ రవాణా జరగడానికి వీల్లేకుండా అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దు చెక్‌పోస్టులను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. విలేజ్ పోలీసు అధికారులు (VPO) ఆయా గ్రామలపై నిఘా ఉంచి, ముందస్తు సమాచారాన్ని సేకరించి, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేయాలని ఆదేశించారు.
Cp Sai Chaitanya | ఎన్నికల రోజు
ఎన్నికల రోజు సిబ్బంది తెల్లవారుజాము నుంచే పక్కాగా విధులకు హాజరవ్వాలని సీపీ పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత ఓట్ల లెక్కింపు కార్యక్రమం పూర్తయ్యేవరకు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా బాధ్యతలు నిర్వర్తించాలని ఆదేశించారు. సమీక్షలో నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐ సురేష్, డిచ్పల్లి సీఐ వినోద్, ధర్పల్లి సీఐ భిక్షపతి, నిజామాబాద్ రూరల్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్, డిచ్పల్లి ఎస్సై ఆసిఫ్ , జక్రాన్‌పల్లి ఎస్సై మహేష్, ఇందల్వాయి ఎస్సై సందీప్, మాక్లూర్ ఎస్సై రాజశేఖర్, సిరికొండ ఎస్సై రామకృష్ణ, ధర్పల్లి ఎస్సై కళ్యాణి, ముప్కాల్ ఎస్సై సుస్మిత తదితరులు పాల్గొన్నారు.