అక్షరటుడే, బాన్సువాడ: Banswada | వినాయక శోభాయాత్ర (Shobayatra) మార్గంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు.
బాన్సువాడ పట్టణంలో గణేష్ నిమజ్జన (Ganesh Nimajjanam) శోభాయాత్ర రూట్ మ్యాప్‌ను మంగళవారం సబ్ కలెక్టర్ కిరణ్మయితో (Sub collector Kiranmai) కలిసి పరిశీలించారు. వారి వెంట డీఎస్పీ విఠల్‌రెడ్డి (DSP Vittla Reddy), మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, విద్యుత్ శాఖ అధికారులు, గ్రామ పెద్దలు ఉన్నారు.
Banswada | కల్కి చెరువు పరిశీలన..
కల్కి చెరువు (Kalki Cheruvu) పరిసరాలను ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు విద్యుత్ తీగలు, వీధిదీపాలు తదితర అంశాలను సమీక్షించారు. ప్రజలు శాంతియుతంగా నిమజ్జనం ఉత్సవాలను నిర్వహించుకోవాలని సూచించారు. భద్రతాపరంగా ఇబ్బందులు కలుగకుండా శోభాయాత్రలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. శోభాయాత్రలో పాల్గొనేవారు అధికారులతో సహకరించి పండుగను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐ అశోక్, మోసాని శ్రీనివాస్ రెడ్డి, దాసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.