Homeజిల్లాలునిజామాబాద్​collector Vinay Krishna Reddy | పంద్రాగస్టు వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి

collector Vinay Krishna Reddy | పంద్రాగస్టు వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: collector Vinay Krishna Reddy | స్వాతంత్య్ర దినోత్సవ (Independence Day) వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​లో శుక్రవారం ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వేదిక, సీటింగ్ ఏర్పాట్లను పక్కాగా చేయాలని, వర్షాలు కురుస్తున్నందున వాటర్ ప్రూఫ్ టెంట్లు (Waterproof tents) వేయించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చికిత్స అందించేలా వైద్య బృందాన్ని, 108 అంబులెన్స్​ను అందుబాటులో ఉంచాలన్నారు. అన్నిశాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ఆయా శాఖల పనితీరును చాటేలా శకటాల ప్రదర్శనకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ప్రొటోకాల్​ను అనుసరిస్తూ అతిథితులకు ఆహ్వానాలు పంపాలని సూచించారు.

collector Vinay Krishna Reddy | సాంస్కృతిక కార్యక్రమాలు..

జాతీయ భావన పెంపొందేలా విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్​ సూచించారు. ఎక్కడ కూడా జాతీయ పతాకం గౌరవానికి భంగం వాటిల్లకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రశంసాపత్రాల బహూకరణ కోసం శాఖల వారీగా ఉత్తమ ఉద్యోగుల పేర్లతో ప్రతిపాదనలు పంపించాలన్నారు.

సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి(Trainee Collector Caroline Chingtianmavi), జడ్పీ సీఈవో సాయా గౌడ్, నగరపాలక సంస్థ (Municipal Corporation) కమిషనర్​ దిలీప్ కుమార్, ఆర్డీవో రాజేంద్రకుమార్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి(ACP Raja Venkat Reddy) తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News