అక్షరటుడే, బాన్సువాడ: Paddy Centers | రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలని డీసీవో రామ్మోహన్రావు (DCO Rammohan Rao) సూచించారు. బాన్సువాడలో వరిధాన్యం కొనుగోలు సీజన్ ప్రారంభానికి ముందుగా అవసరమైన ఏర్పాట్లపై మంగళవారం సమీక్షించారు.
బాన్సువాడ (banswada), నస్రుల్లాబాద్ (Nasrullabad), బీర్కూర్ (Birkoor) మండలాల పరిధిలోని పీఏసీఎస్ కార్యదర్శులు, సిబ్బంది, ట్యాబ్ ఆపరేటర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేడ్ ‘ఏ’ రకం వరికి క్వింటాలుకు రూ.2,389, సాధారణ రకం వరికి రూ.2,369 మద్దతు ధర చెల్లించనున్నట్లు తెలిపారు.
ధాన్యం తూకం, రవాణా, చెల్లింపుల విషయంలో పారదర్శకత పాటించాలని, రైతులకు ఇబ్బందులు రానీయకుండా తక్షణమే కొనుగోలు పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్, క్లస్టర్ అధికారి కవిత, అధికారులు నర్సింలు, నాగరాజు, సాయినాథ్, సృజన్, అలీమొద్దీన్, సొసైటీ కార్యదర్శులు జకీర్ హుస్సేన్, విఠల్, శ్రీనివాస్, భూమయ్య, వెంకట్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.