అక్షరటుడే, బాన్సువాడ : Panchayat Elections | మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) పేర్కొన్నారు. బాన్సువాడలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆయన మంగళవారం సందర్శించారు.
Panchayat Elections | గందరగోళానికి గురికావద్దు..
ఎన్నికల సామగ్రిని ఎలాంటి లోటుపాట్లు గందరగోళానికి తావు లేకుండా సిబ్బందికి పక్కాగా అందించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి అందిందా లేదా పరిశీలించుకోవాలని సిబ్బందితో పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తేవాలని, పోలింగ్ స్టేషన్లో అన్ని ఏర్పాట్లపై క్రాస్‌చెక్ చేసుకోవాలని ఆర్వోలకు సూచించారు. ఆయన వెంట బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి (Sub Collector Kiranmayi) తదితరులున్నారు.