అక్షరటుడే ఇందూరు: Arrangements for the Mayor Election | నగరపాలక సంస్థ కార్యాలయాన్ని(Municipal Corporation Office) కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) ఆదివారం సందర్శించారు. మేయర్ ఎన్నిక కార్యక్రమం సోమవారం జరుగనున్న నేపథ్యంలో ఆమె కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్తో(Municipal Commissioner Dilip Kumar) మాట్లాడారు.
Arrangements for the Mayor Election | ఎలాంటి లోటుపాట్లు లేకుండా..
నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుల(Ex officio members) హోదాలో ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆయా మున్సిపాలిటీల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసులకు సూచించారు.
ఉదయం 11 గంటలకు..
మున్సిపల్ కార్పొరేషన్లో.. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ముందుగా నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో స్పెషల్ ఆఫీసర్లు ప్రమాణ స్వీకారం చేయిస్తారని తెలిపారు. అనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా మధ్యాహ్నం 12:30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక జరుగుతుందన్నారు. పూర్తి పారదర్శకంగా ఎన్నిక జరుగుతుందని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట ఆర్డీవో రాజేంద్రకుమార్ ఉన్నారు.