అక్షరటుడే, ఇందూరు: Arrangements for Mayoral Election | మేయర్ ఎన్నికకు నిజామాబాద్ మున్నిపల్ కార్పొరేషన్ (Municipal Corporation) భవనం ముస్తాబవుతోంది. అధికారులు మేయర్ ఛాంబర్, సమావేశం గదిలో ఏర్పాట్లు చేస్తున్నారు. కార్పొరేషన్ కమిషనర్ దిలీప్‌కుమార్ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి.
Arrangements for Mayoral Election | మొత్తం 60 డివిజన్లు..
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ (Nizamabad BJP) 28 డివిజన్లను కైవసం చేసుకుని ఆధిక్యంలో నిలిచింది. అధికార కాంగ్రెస్‌పార్టీ 17 స్థానాలు, ఎంఐఎం 14 స్థానాలు దక్కించుకున్నాయి. ఒక స్థానంలో బీఆర్ఎస్ గెలిచింది. అయితే మ్యాజిక్ ఫిగర్‌కు బీజేపీ దూరం కావడంతో తాము ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్ (Congress Nizamabad), ఎంఐఎం(AIMIM Nizamabad) కలిసి మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలకు అభ్యర్థుల వేటలో పడ్డాయి.
16న ఎన్నిక..
ఈనెల 16న మేయర్ ఎన్నిక ఉండడంతో నగరపాలక సంస్థ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్లో కార్పొరేటర్లు, అధికారులు, ప్రజా ప్రతినిధులు కూర్చునే ప్రాంతాలను కమిషనర్ దిలీప్ కుమార్‌తోపాటు ఏసీపీ ప్రకాశ్ పరిశీలించారు. అలాగే ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్‌కు సూచనలు చేశారు.
