HomeతెలంగాణInter Supplementary Exams| ఇంటర్​ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

Inter Supplementary Exams| ఇంటర్​ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Inter-supplementary Exams | ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం పూర్తి ఏర్పాట్లు చేసినట్లు డీఐఈవో రవికుమార్ తెలిపారు. సోమవారం ప్రభుత్వ బాలుర కళాశాలలో సీఎస్, డీవోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లావ్యాప్తంగా 18,837 మంది విద్యార్థులు హాజరుకానున్నారని పేర్కొన్నారు.

ఇందులో మొదటి సంవత్సరంలో (Inter First Year) 11,515 మంది, ద్వితీయ సంవత్సరానికి 7,322 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందుకోసం మొత్తం 36 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ (Flying Squad), ఆరు సిట్టింగ్ స్క్వాడ్ (Sitting squad) బృందాలను నియమించినట్లు తెలిపారు. అలాగే పోలీసు, రెవెన్యూ, పోస్ట్ ఆఫీస్, విద్యుత్, వైద్య ఆరోగ్యశాఖ (Department of Health), ఆర్టీసీ అధికారుల సమన్వయంతో పరీక్షల నిర్వహణ సజావుగా సాగేలా చూస్తామని అన్నారు.