అక్షరటుడే, బోధన్: Vinayaka Chavithi | పట్టణంలో గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో (Bodhan Sub-Collector Vikas Mahato) అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం డివిజన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిమజ్జనం సందర్భంగా రోడ్లపై ఉన్న గుంతలను తక్షణమే పూడ్చివేయించాలని సూచించారు. అలాగే నిమజ్జన యాత్ర రూట్లో అడ్డుగా ఉన్న చెట్లకొమ్మలను తొలగించాలని.. కరెంట్ తీగలను సరిచేయాలని విద్యుత్‌శాఖ అధికారులకు సూచించారు.
వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే చెరువు వద్ద గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని కోరారు. వారు ఎల్లవేళలా అలర్ట్‌గా ఉండేలా స్థానిక అధికారులను అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు. నిమజ్జనం జరిగే రూట్లో పటిష్టమైన పోలీస్ బందోబస్తు (Police security) ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. సమీక్షలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్ (Bodhan ACP Srinivas), తహశీల్దార్ విఠల్, తదితరులు పాల్గొన్నారు.