అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Arrangements at Counting Centers | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ (Nizamabad Police Commissionerate) పరిధిలో శుక్రవారం కౌంటింగ్ కేంద్రాల వద్ద నియమ నిబంధనలు పాటించాలని సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు.
Arrangements at Counting Centers | కౌంటింగ్ కేంద్రాల్లో..
అర్బన్‌కు సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో (Polytechnic College), బోధన్ విజయమేరి హైస్కూల్లో (Vijayameri High School), ఆర్మూర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, భీమ్‌గల్‌లోని (Bheemgal) ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని సీపీ తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో మేయర్, చైర్పర్సన్ల ఎన్నికల ప్రక్రియ ఈనెల 16న ఉంటుందన్నారు. కౌంటింగ్ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామన్నారు.
ఊరేగింపు కార్యక్రమాలపై నిషేధం
ఎన్నికల నిబంధనల దృష్ట్యా విజయం సాధించిన అభ్యర్థులు ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించడం పూర్తిగా నిషిద్ధమన్నారు. విజయోత్సవ, బైక్ ర్యాలీ, పటాకులు కాల్చడంపై నిషేధం ఉందన్నారు. ప్రజలకు చిరాకు కలిగించే కార్యక్రమాలు చేయవద్దని సీపీ సూచించారు. ముందస్తు అనుమతి లేకుండా బహిరంగ సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించవద్దన్నారు. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.