అక్షరటుడే, వెబ్డెస్క్: Kids Care Hospital | నిజామాబాద్ (Nizamabad) నగరంలోని ఖలీల్వాడిలో గల కిడ్స్ కేర్ ఆస్పత్రి నవజాత శిశువులకు ఆరోగ్య శ్రీ ద్వారా సేవలు అందిస్తామని తెలిపింది. అప్పుడే పుట్టిన పిల్లలకు ఆరోగ్య శ్రీ పథకం (Arogya Sri Scheme)లో భాగంగా ఉచిత వైద్య సేవలు అందిస్తామని ఆస్పత్రి వైద్యుడు రమేశ్ పవార్ తెలిపారు.
నవజాత శిశువులకు ఆరోగ్య శ్రీ కింద పిడియాట్రిక్ సర్జరీలు, ఇతర అన్ని సమస్యలకు ఉచిత చికిత్స అందిస్తామన్నారు. తక్కువ బరువుతో పుట్టడం, శ్వాస సంబంధ సమస్యలు, ఫిట్స్, పచ్చ కామెర్లు తదితర వ్యాధులకు ఉచితంగా వైద్యం చేస్తామని తెలిపారు. పిల్లల కిడ్నీల్లో రాళ్లకు సైతం చికిత్స అందిస్తామని పేర్కొన్నారు. త్వరలో ఆస్పత్రిని హార్విక కిడ్స్ కేర్ (Harvika Kids Care)గా మారుస్తామని చెప్పారు. అనంతరం గైనకాలజీ, యూరాలజీ, జనరల్ సర్జరీ, జనరల్ ఫిజిషీయన్ సేవలు సైతం అందిస్తామని తెలిపారు.