ePaper
More
    HomeజాతీయంJammu and Kashmir | ఆర్మీ వాహ‌నం బోల్తా.. ముగ్గురు జ‌వాన్లు మృతి.. 15 మందికి...

    Jammu and Kashmir | ఆర్మీ వాహ‌నం బోల్తా.. ముగ్గురు జ‌వాన్లు మృతి.. 15 మందికి గాయాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jammu and Kashmir | సైనికుల‌తో వెళ్తున్న బ‌స్సు అదుపు త‌ప్పి బోల్తా ప‌డ‌డంతో ముగ్గురు జ‌వాన్లు మృతి చెందారు. 15 మందికి గాయాల‌య్యాయి. జమ్మూ కాశ్మీర్‌(Jammu and Kashmir)లోని ఉధంపూర్ జిల్లా(Udhampur District)లోని బసంత్‌గఢ్ ప్రాంతంలోని కాండ్వా సమీపంలో గురువారం ఈ ఘ‌ట‌న జ‌రిగింది. 23 మంది సిబ్బందితో వెళుతున్న వాహనం రోడ్డు పక్కన అదుపుతప్పి బోల్తా కొట్టింది. బసంత్ గఢ్‌(Basantgarh)లో భద్రతా సిబ్బంది ఆపరేషన్ ముగించుకుని తిరిగి వస్తుండగా కద్వా ప్రాంతంలో ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.

    Jammu and Kashmir | స‌హాయ‌క చ‌ర్య‌లు..

    ప్ర‌మాద విష‌యం తెలిసిన వెంట‌నే అధికారులు హుటాహుటిన స‌హాయక చ‌ర్య‌లు ప్రారంభించారు. ముగ్గురు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (Central Reserve Police Force) సిబ్బంది మరణించగా, 15 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరో 16 మంది గాయపడ్డారు. వారందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు.

    Jammu and Kashmir | మృతుల‌కు నివాళి..

    CRPF సిబ్బంది మృతి పట్ల జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా(Lieutenant Governor Manoj Sinha) విచారం వ్యక్తం చేశారు. “ఉధంపూర్ సమీపంలో జరిగిన ప్రమాదంలో CRPF సిబ్బందిని కోల్పోవడం బాధాకరం. దేశానికి వారు చేసిన ఆదర్శప్రాయమైన సేవను ఎప్పటికీ మర్చిపోలేము. మృతుల కుటుంబాలకు నా ప్ర‌గాఢ సానుభూతి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. వారికి అత్యుత్త‌మ వైద్యం అందించాల‌ని ఆదేశించిన‌ట్లు” చెప్పారు.

    ఈ ప్ర‌మాదంపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్(Union Minister Jitendra Singh) కూడా విచారం వ్యక్తం చేశారు. కాండ్వా–బసంత్‌గఢ్ ప్రాంతంలో CRPF వాహనం ప్రమాదానికి గురై ముగ్గురు జ‌వాన్లు మృతి చెంద‌డం బాధాకరమ‌ని ఆయ‌న పేర్కొన్నారు. స‌హాయ‌క చర్య‌లు కొన‌సాగుతున్నాయ‌ని తెలిపారు.

    Latest articles

    National Handloom Day | పిట్లంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం

    అక్షరటుడే, నిజాంసాగర్: National Handloom Day | పిట్లం (Pitlam) మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘం (Handloom...

    Bheemgal | ప్రొటోకాల్ పాటించడంలేదని ఫిర్యాదు

    అక్షరటుడే, భీమ్​గల్: Bheemgal | మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో వడ్డీ రాయితీ రుణాల పంపిణీ కార్యక్రమంలో...

    National Handloom Day | చేనేతరంగానికి ప్రభుత్వం చేయూతనివ్వాలి

    అక్షరటుడే, ఇందూరు: National Handloom Day | చేనేతరంగానికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనివ్వాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ...

    Handloom Workers Day | ఘనంగా జాతీయ చేనేత కార్మిక దినోత్సవం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Handloom Workers Day | జిల్లా, నిజామాబాద్ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో...

    More like this