అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Army Chief | ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్థాన్‌కు భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది (Indian Army Chief Upendra Dwivedi) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సీమాంతర ఉగ్రవాదాన్ని (terrorism) ఇకనైనా ఆపకపోతే ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచపటంలో పాకిస్తాన్ ఉండాలంటే సీమాంతర ఉగ్రవాదం ఆపాల్సిందేనన్నారు. లేకపోతే పాక్‌ను భూగోళంలో లేకుండా చేస్తామంటూ హెచ్చరించారు. రాజస్థాన్‌లోని (Rajasthan) అనూప్‌గఢ్‌లోని ఆర్మీ పోస్ట్‌ను సందర్శించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ 1.0లో సంయమనం పాటించామన్నారు. కానీ ఈ సారి అలా ఉండబోదన్నారు. ఉగ్రవాదాన్ని ఆపకపోతే త్వరలో ఆపరేషన్ సిందూర్ 2.0 (Operation Sindoor 2.0) చేపడతామన్నారు. పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తామని చెప్పారు.
పాకిస్తాన్‌పై మరింత తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూమిపై ఉండాలనుకుంటే సీమాంతర ఉగ్రవాదాన్ని పాక్ ఆపాల్సిందేనన్నారు. లేదంటే చరిత్ర నుంచి తుడిచిపెట్టుకోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ఇందుకు సైన్యం సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని సైనికులను ఆదేశించారు.