అక్షరటుడే, ఆర్మూర్: Armoor Postal Ballot Results | మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Election) భాగంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయింది. 7వ వార్డు బీజేపీ అభ్యర్థి ఖాందేశ్ ప్రశాంత్‌కు 36 ఓట్లు వచ్చాయి. 25వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి భూపేందర్‌కు 23 ఓట్లు, 24వ వార్డు కాంగ్రెస్ (Congress) అభ్యర్థి రవి గౌడ్‌కు 19 ఓట్లు పోలయ్యాయి.
ఆర్మూర్‌లో 36 వార్డులకు గాను మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 385 ఉండగా కాంగ్రెస్‌కు 149, బీజేపీకి 147, బీఆర్ఎస్కు 20, ఎంఐఎంకు 1,ఆమ్ ఆద్మీ పార్టీకి 2, ఇండిపెండెంట్ అభ్యర్థులకు 25, నోటాకు 2 రెండు ఓట్లు వచ్చాయి.
Armoor Postal Ballot Results | 39 ఓట్లు ఇన్ వాలిడ్
ఆర్మూర్ మున్సిపాలిటీ (Armoor Municipality) లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో 39 ఓట్లు ఇన్ వాలిడ్ కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఓటింగ్ విధానం పట్ల ఓటర్లకు అవగాహన కల్పించే ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లే ఇన్వాయిడ్ కావడం గమనార్హం.