Armur Municipal Council | ఆర్మూర్​ బల్దియా పాలకవర్గం బాధ్యతల స్వీకరణ

ఆర్మూర్​ మున్సిపల్ పాలకవర్గం గురువారం కొలువుదీరింది. మున్సిపల్ ఛైర్​పర్సన్​గా గోనె లహరి, వైస్ ఛైర్మన్​గా కాటిపల్లి వెంకటరెడ్డితో పాటు కౌన్సిలర్లు బాధ్యతలు స్వీకరించారు.

అక్షరటుడే,ఆర్మూర్: Armur Municipal Council | ఆర్మూర్​ మున్సిపల్ పాలకవర్గం గురువారం కొలువుదీరింది. మున్సిపల్ ఛైర్​పర్సన్ (Municipal Chairperson)​గా గోనె లహరి, వైస్ ఛైర్మన్​గా కాటిపల్లి వెంకటరెడ్డితో పాటు కౌన్సిలర్లు బాధ్యతలు స్వీకరించారు.

Armur Municipal Council | మున్సిపల్​ కమిషనర్​ ఆధ్వర్యంలో..

మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు చైర్​పర్సన్​, వైస్ ఛైర్మన్​లతో సంతకాలు చేయించారు.ఈ కార్యక్రమంలో మినరల్స్ రాష్ట్ర చైర్మన్ ఈరవత్రి అనిల్, కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏబీ చిన్న, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

బల్దియాలో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్​..

బల్దియాలో 36వార్డులు ఉండగా కాంగ్రెస్​ 19స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ (BJP) 8, బీఆర్​ఎస్​ 5, స్వతంత్రులు 3, ఎంఐఎం 1 స్థానాల్లో గెలిచారు. కాంగ్రెస్​కు స్పష్టమైన మెజారిటీ రావడంతో ఛైర్​పర్సన్​గా గోనె లహరి ఛైర్​పర్సన్​గా ఎన్నుకున్నారు.

Related articles

Exam Center Security | పరీక్ష కేంద్రాల్లో మాల్​ ప్రాక్టీస్​కు తావులేకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

ఇంటర్​ పరీక్ష కేంద్రాల్లో మాల్​ ప్రాక్టీస్​కు తావులేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి అన్నారు. బోధన్​ పట్టణంలోని జూనియర్​ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని గురువారం ఆమె తనిఖీ చేశారు.

NCERT Book Ban | ఎన్​సీఈఆర్​టీపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. పుస్తకంపై నిషేధం

ఎన్​సీఈఆర్​టీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎనిమిదో తరగతి సోషల్​ సైన్స్​ పుస్తకాన్ని నిషేధించింది.

Chain Snatching Kotagiri | కోటగిరిలో చైన్​స్నాచింగ్​.. మూడు తులాల గొలుసు అపహరణ..

జిల్లాలో వరుస చైన్​స్నాచింగ్​ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రామాల్లో, పట్టణాల్లో అనే తేడాలేకుండా ఎక్కడ పడితే అక్కడ దోపిడీకి తెగబడుతున్నారు.

Holi Special Trains | ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. హోలీకి ప్రత్యేక రైళ్లు

హోలీ పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 1,244 ట్రిప్పులు వేసినట్లు పేర్కొంది.