అక్షరటుడే, ఆర్మూర్ : Armur Municipal Congress Win | ఆర్మూర్ మున్సిపల్ (Armoor Municipal) పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఉత్కంఠభరిత పోరులో చివరికి కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 36 వార్డులకు గాను 19 వార్డులను కాంగ్రెస్ గెలుచుకుంది. బీజేపీ 8 వార్డుల్లో విజయం సాధించింది. బీఆర్ఎస్ ఐద స్థానాల్లో విజయం సాధించింది. ఎంఐఎం ఒకస్థానం, స్వంతంత్రులు గెలుపొందారు.
Armur Municipal Congress Win | విజేతలు వీరే…
1వ వార్డు స్వతంత్ర అభ్యర్థి సల్మాన్, 2వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి నాగేంద్ర, 3వ వార్డు బీజేపీ అభ్యర్థి యామాద్రి కవిత భాస్కర్, 4వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సృజన, 5వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బండారు గీత, 6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి షేర్ల మమత, 7వ వార్డు బీజేపీ అభ్యర్థి ఖాందేశ్ ప్రశాంత్, 8వ వార్డు డిచ్పల్లి శారద, 9వ వార్డు బీజేపీ అభ్యర్థి పోచంపాడు శ్రీను, 10వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి ఎండీ నయీం, 11వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కాటిపల్లి వెంకట్ రెడ్డి, 12వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి తాటి నీలిమ హన్మాండ్లు, 13వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కోడిగెల మల్లయ్య, 14వ వార్డు షేక్ సైఫ్ కాంగ్రెస్ , 15వ గోనె లహరి కాంగ్రెస్ 16వ వార్డు బీజేపీ అభ్యర్థి దొండి కవిత ఈశ్వర్, 17వ వార్డు రహత్ ఉన్నీసా, బీఆర్ఎస్, 18వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ సంగీత విజయం సాధించారు.
పట్టణంలోని 19వ వార్డు స్వతంత్ర అభ్యర్థి దియా అగర్వాల్, 20 వ వార్డు హరీఫా ఖానమ్, 21వ వార్డు బీజేపీ అభ్యర్థి అనూష, 22వ వార్డు ఎంఐఎం అభ్యర్థి జాహిర్ అలీ, 23వ వార్డు బీజేపీ అభ్యర్థి బొట్టు రాజు, 24వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ గౌడ్ (రవిగౌడ్), 25వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి భూపేందర్, 26వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి జో శ్రీను, 27వ వార్డు స్వతంత్ర అభ్యర్థి ఇలియాస్, 28 నదియా తహసీల్ బీఆర్ఎస్, 29వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి తిరుమల సుమన్, 30వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి పృథ్వి, 31వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్తి బొప్పెన ప్రసాద్, 32వ వార్డు బీజేపీ అభ్యర్థి బోచ్కర్ శ్రీనివాస్ (పాను శ్రీను), 33వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి భోగడమీది రాణి సుమన్, 34వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి నర్మే నవీన్, 35వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సడాక్ వినోద్, 36వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బారడ్ గంగమణి గెలుపొందారు.