30
అక్షరటుడే, ఆర్మూర్ : Armoor Municipal Chairperson | ఆర్మూర్ మున్సిపల్ ఛైర్పర్సన్గా గోనె లహరి ఎన్నికయ్యారు. ఈ మేరకు సోమవారం మున్సిపల్ కార్యాలయం (Municipal Office)లో ఆమె ఛైర్పర్సన్గా ప్రమాణస్వీకారం చేశారు. ముందుగా వార్డు మెంబర్లతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎన్నిక నిర్వహించారు.
Armoor Municipal Chairperson | వార్డు నుంచి విజయం..
పట్టణంలోని 15వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థినిగా (Congress Candidate) గోనె లహరి పోటీచేసి విజయం సాధించారు. మొదటిసారిగా ఆమె ఎన్నికల్లో నిలబడ్డారు. ప్రస్తుతం ఈమె మహాలక్ష్మి కాలనీలో మెడికల్ ఏజెన్సీ (Medical Agency) నిర్వహిస్తున్నారు. గోనె హారిక భర్త రఘు పట్టణంలోనే బీడీ కార్ఖానా నిర్వహిస్తున్నారు.