అక్షరటుడే,ఆర్మూర్ : Armur Municipal Chairperson Election | ఆర్మూర్ మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయం (Armoor Municipal Office)లోని సమావేశ మందిరంలో సోమవారం కౌన్సిలర్ ప్రమాణ స్వీకారం నిర్వహించనున్నారు.
ఛైర్పర్సన్, వైస్‌ఛైర్మన్ ఎన్నికకు మున్సిపల్ అధికారులు (Municipal Officers) ఏర్పాట్లు పూర్తిచేశారు. మొదట కౌన్సిలర్ ప్రమాణస్వీకారం అటు తర్వాత ఛైర్పర్సన్, వైస్‌ఛైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు. చేతులు లేపడం ద్వారా ఛైర్ పర్సన్ ఎన్నిక నిర్వహిస్తారు.
Armur Municipal Chairperson Election | ఆమె ఎన్నిక లాంఛనమేనా..
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో 36 వార్డులకు గాను కాంగ్రెస్ 19, బీజేపీ 8, బీఆర్ఎస్ 5, ఎంఐఎం 1, స్వతంత్రులు 3 స్థానాల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్‌కు చేరుకోవడంతో ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్ కాంగ్రెస్ పరం కానుంది. కాగా ఛైర్పర్సన్ రేసులో భారత్ గ్యాస్ సుమన్ సతీమణి తిరుమల.. మరోవైపు గోనె లహరి పోటీపడుతున్నారు. వైస్ ఛైర్మన్ పదవిని రవిగౌడ్, భూపేందర్ఆ శిస్తున్నారు.
Armur Municipal Chairperson Election | రంగంలోకి ఈరవత్రి అనిల్
తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఈరవత్రి అనిల్ (Eeravatri Anil) రంగంలోకి దిగినట్లు సమాచారం. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన గోనె లహరిని ఛైర్ పర్సన్‌గా చేయాలన్న ఉద్దేశంతో పావులు కలుపుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే వినయ్ రెడ్డి అనుచరుడైన భూపేందర్‌కు వైస్ ఛైర్మన్ పదవి కట్టబెడతారన్న ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఉత్కంఠకు మరో గంటలో తెరపడనుంది.
1 comment
[…] భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీ Armur Municipal Chairperson Election | ఆర్మూర్‌లో హైటెన్షన్… […]
Comments are closed.