అక్షరటుడే, ఆర్మూర్ : Armur Municipal Chairperson Election | ఆర్మూర్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) కాంగ్రెస్ ఛైర్పర్సన్ అభ్యర్థిని అనూహ్యంగా ఓటమి పాలవడంతో ఇతరులు ఆ పీఠం కోసం పావులు కదుపుతున్నారు.
Armur Municipal Chairperson Election | 17వ వార్డు నుంచి పోటీ
ఆర్మూర్ మున్సిపాలిటీ (Armoor Municipality)లో 36వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ 19స్థానాలు, బీజేపీ 8, బీఆర్ఎస్ 5, స్వతంత్రులు ఒక స్థానాన్ని గెలుచుకున్నారు. అయితే ఛైర్పర్సన్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యింది. దీంతో కాంగ్రెస్ మున్సిపల్ ఛైర్నర్సన్ అభ్యర్థిగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఏబీ చిన్న సతీమణి ఏబీ శ్రీదేవి పేరు ఖరారు చేసినట్లు ప్రచారం జరిగింది. కాగా ఆమె 17వ వార్డు నుంచి పోటీకి దిగగా.. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిని విజయం సాధించడంతో మున్సిపల్ ఛైపర్సన్ పీఠంపై వారి ఆశలు గల్లంతయ్యాయి.
పావులు కదుపుతున్న ఇతరులు..
కాంగ్రెస్ ఛైర్పర్సన్ అభ్యర్థిని (Congress Chairperson Candidate) అనూహ్యంగా ఓటమి పాలవడంతో అప్పటివరకు ఉన్న పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఇతర మహిళా అభ్యర్థినుల తరపున వారి అనుయాయులు ఛైర్పర్సన్ పీఠం కోసం మంతనాలు మొదలుపెట్టారు. అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సమాచారం. అయితే భారత్ గ్యాస్ సుమన్ సతీమణి తిరుమల, గోనె లహరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. భారత్ గ్యాస్ సుమన్ సౌమ్యుడు, వివాదరహితుడు కావడంతో వారికే ఛైర్పర్సన్ పీఠం వరిస్తుందని ప్రజలు భావిస్తున్నారు. అలాగై వైస్ ఛైర్మన్ పదవి కోసం వినయ్‌రెడ్డి అనుచరుడు భూపేందర్‌తో పాటు రవి గౌడ్ పోటీ పడుతున్నట్లుగా తెలుస్తోంది. 16న ఛైర్పర్సన్ ఎన్నిక ఉండడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆర్మూర్ ఛైర్పర్సన్ పీఠం ఎవరికి కట్టపెడుతుందో వేచిచూడాల్సిందే.
