అక్షరటుడే, ఆర్మూర్: Dog Bite | పట్టణంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రతివీధిలో పదుల సంఖ్యలో రోడ్లపై తిరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పిల్లలు పెద్దలపై దాడులకు పాల్పడుతున్నాయి. పట్టణంలోని పలు కాలనీల్లో పిల్లలు పెద్దలపై కుక్కలు దాడులకు పాల్పడి తీవ్రంగా కరిచిన సందర్భాలు ఉన్నాయి.
Dog Bite | యోగేశ్వర కాలనీలో..
పట్టణంలోని యోగేశ్వర కాలనీ (Yogeshwar Colony) గేటు వద్ద ఒకే దగ్గర పదికి పైగా కుక్కలు చేరడంతో ప్రజలు ఆ మార్గం గుండా వెళ్లడానికే జంకుతున్నారు. గతంలో మామిడిపల్లి (Mamidipally) ప్రాంతంలో ఒకే కుక్క 21 మందిపై దాడి చేసింది. ఇందులో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. అయినప్పటికీ మున్సిపల్ అధికారుల నుంచి ఎలాంటి చర్యలు లేవని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
