Armoor
Armoor | ఆర్మూర్ ప్రెస్​క్లబ్ కార్యవర్గం ఎన్నిక

అక్షరటుడే, ఆర్మూర్: Armoor | పట్టణంలోని ప్రెస్​క్లబ్​లో (Press Club) మంగళవారం కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. నూతన అధ్యక్షుడిగా సందీప్, కార్యదర్శిగా సునీల్, కోశాధికారి అజీం, ఉపాధ్యక్షుడిగా జానా రమేష్, జాయింట్ సెక్రటరీ చక్రధర్, ఈసీ మెంబర్లు సామ మురళి, చేతన్ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గసభ్యులు మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమానికి తాము కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎన్నిక నిర్వహణాధికారులు రాజేశ్వర్ గౌడ్, పుట్టి మురళి, మాజీ అధ్యక్ష కార్యదర్శులు నెమలి ప్రశాంత్, సురేందర్ గౌడ్, సీనియర్ జర్నలిస్టులు గంగుల పద్మయ్య, పింజ సుదర్శన్, ప్రసాద్, క్రాంతి, వెంకన్న, సాయి, సాజిద్ పాల్గొన్నారు.