అక్షరటుడే, ఆర్మూర్: Armoor | ఆర్మూర్ బట్టల వర్తక సంఘం (Armoor Cloth Merchants Association) నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. దీంతో పట్టణంలో (Armoor City) నూతన కార్యవర్గ సభ్యులకు సోమవారం సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సంతని అశోక్ కుమార్ (విఠల్ క్లాత్), ప్రధాన కార్యదర్శి పోల ప్రవీణ్(పద్మావతి సిల్స్)ను వారి మిత్రులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ధన్వి ఫ్యాషన్స్ అభిషేక్, వెంకటేశ్వర శ్రీనివాస్, ధనలక్ష్మి దత్తాద్రి, దుర్గా గణేష్, రాజ రాజేశ్వర్ రమేష్, లక్ష్మీ సౌభాగ్య సంజీవ్, పెంటోజి చందు తదితరులు పాల్గొన్నారు.