ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Armoor Flood | భారీ శబ్ధానికి ఇంట్లోని వాళ్లందరూ షాక్​.. కళ్లు తెరిచి చూస్తే..

    Armoor Flood | భారీ శబ్ధానికి ఇంట్లోని వాళ్లందరూ షాక్​.. కళ్లు తెరిచి చూస్తే..

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: Armoor Flood | నిజామాబాద్​ జిల్లాలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. గురువారం (ఆగస్టు 28) ఉదయం నుంచే ఎడతెరపీయకుండా వర్షం కురుస్తోంది.

    ఆర్మూర్​ పట్టణంలో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. పలు కాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది.

    ఫలితంగా ఆర్మూర్​ Armoor లోని లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఓ వైపు వాన,  మరోవైపు వరదతో ఆగమయ్యారు.

    Armoor Flood | ఇంటి ముంగిట మృత్యురాయి..

    గురువారం కురిసిన భారీ వర్షం కారణంగా కమలా నెహ్రూ కాలనీలో (Kamala Nehru Colony) షాకింగ్​ ఘటన చోటుచేసుకుంది. ఎడతెరపీయని వర్షాల వల్ల పక్కనే ఉన్న కొండపై ఉన్న మట్టి కొట్టుకుపోయింది. దీంతో కొండపై ఉన్న రాళ్లు అదుపు తప్పుతున్నాయి.

    ఇలా అదుపు తప్పిన ఓ భారీ బండరాయి దొర్లుకుంటూ కిందికి దొర్లుకుంటూ వచ్చింది. నేరుగా కింద ఉన్న ఓ ఇంటి గోడను ఢీ కొని ఆగిపోయింది. వర్షం వల్ల ఆ ప్రాంతంలో బయట ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

    Armoor Flood : గోడ, డోర్​ను ఢీకొని..

    ఇక భారీ బండరాయి ఇంటి గోడను ఢీ కొనడంతో ఆ నివాసంలో ఉన్న ఇంటివారు ఒక్కసారిగా షాక్​కు గురయ్యాయి. ఏమైందో తెలియక బయటకు పరుగులు తీద్దామని డోర్​ వద్దకు రాగా.. తలుపు కూడా ధ్వంసం అయిందని గుర్తించి భయాందోళనకు లోనయ్యారు.

    స్థానికుల సాయంతో అతి కష్టం మీద బయటకు వచ్చారు. ఇంటి బయటకు వచ్చిన ఆ కుటుంబీకులు.. తలుపునకు ఎదురుగా ఉన్న భారీ బండరాయిని చూసి కంగుతిన్నారు.

    జరిగిన విషయాన్ని గ్రహించి ఒకింత భయపడినా.. తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడినందుకు ఊపిరిపీల్చుకున్నారు. ఎందుకంటే ఇంకాస్త వేగంతో ఆ రాయి దొర్లుకుంటూ వస్తే.. ఆ కుటుంబంతో సహా ఇంటిని నేల మట్టం చేసేది.

    సమాచారం అందుకున్న మున్సిపల్​ కమిషనర్​ రాజు (Armoor Municipal Commissioner Raju) ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ఇంట్లోని వారిని పునారవాస కేంద్రానికి తరలించారు. బండరాయిని తొలగింపజేస్తామని కమిషనర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

    Latest articles

    Gift nifty | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Gift nifty | యూఎస్‌ మార్కెట్లు(US markets) గురువారం లాభాలతో, యూరోప్‌ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి....

    Gold Price On August 29 | షాకిస్తున్న గోల్డ్.. ఇంకా పెరిగిన ధ‌ర‌.. ఈ రోజు ఎంతంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Price On August 29 : ఇటీవల బంగారం, వెండి silver ధరలు పెరుగుతూ...

    August 29 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    August 29 Panchangam : తేదీ (DATE) – 29 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    Nizamabad Floods | పులాంగ్, బోర్గాం​ వాగులకు పోటెత్తిన వరద.. నీట మునిగిన శ్రీ చైతన్య పాఠశాల, గుడిసెలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Floods : నిజామాబాద్​ జిల్లాలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. గురువారం (ఆగస్టు...

    More like this