అక్షరటుడే, భీమ్‌గల్ : Panchayat Elections | పంచాయతీ ఎన్నికల చివరి విడత పోలింగ్‌లోనూ కాంగ్రెస్ పార్టీ (Congress Party) మద్దతుదారులు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా మెజారిటీ సర్పంచ్ స్థానాలను హస్తం మద్దతుదారులే గెలుచుకున్నారు. మొత్తం 165 పంచాయతీలకు గాను (ఏకగ్రీవాలతో కలిపి) కాంగ్రెస్ మద్దతుదారులు 85 స్థానాల్లో జయకేతనం ఎగురవేశారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 39 స్థానాలకు పరిమితం కాగా.. బీజేపీ మద్దతుదారులు 15 చోట్ల విజయం సాధించారు. ఇతరులు 26 స్థానాలను కైవసం చేసుకున్నారు.
Panchayat Elections | మండలాల వారీగా ఫలితాలు..
పలు మండలాల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది. ముఖ్యంగా నందిపేట్ మండలంలో 22 స్థానాలకు గాను 16 చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచి సత్తా చాటారు. భీమ్‌గల్ మండలంలో (Bheemgal Mandal) మొత్తం 27 పంచాయతీలు ఉండగా కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 6, బీజేపీ 3 స్థానాలను దక్కించుకున్నాయి. మోర్తాడ్, ముప్పాల్లలో ఈ మండలాల్లోనూ హస్తం మద్దతుదారులే పైచేయి సాధించారు. కమ్మర్పల్లి మండలంలో (Kammarpally Mandal) బీఆర్ఎస్ మద్దతుదారులు కొంత ప్రభావం చూపి 6 స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్ 4 స్థానాలకు పరిమితమైంది. వేల్పూర్ మండలంలో బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఇరు పార్టీల మద్దతుదారులు చెరో 6 స్థానాల్లో విజయం సాధించారు.
Panchayat Elections | స్వతంత్రుల కోసం వేట..
రెబల్స్ అభ్యర్థుల కారణంగా పలుచోట్ల ప్రధాన పార్టీల మెజారిటీ తగ్గింది. దీంతో గెలిచిన స్వతంత్రులను తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రధాన పార్టీల నాయకులు ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా, ప్రజలకు అందుబాటులో ఉంటామని గెలిచిన అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 165 పంచాయతీలలో కాంగ్రెస్ అత్యధికంగా 85 స్థానాలను కైవసం చేసుకోగా, బీఆర్ఎస్ 39, బీజేఈ 15, స్వతంత్రులు/ఇతరులు 26 స్థానాల్లో విజయం సాధించారు.