4
అక్షరటుడే, ఆర్మూర్: Armoor | ఆలూర్ మండల కేంద్రానికి (Alur mandal center) చెందిన తోడేటి నర్సింలు(35) చెరువులో పడి మృతి చెందినట్లు సీఐ సత్య నారాయణ (CI Satya Narayana) తెలిపారు. గ్రామానికి చెందిన నర్సింలు (Narasimhulu) మేస్త్రి పని చేస్తుండగా.. కొన్ని రోజులుగా మద్యానికి బానిసగా మారాడు. ఈ క్రమంలో ఈ నెల 5న పనికి వెళుతున్నానని చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. మంగళవారం గ్రామ శివారులోని చెరువులో (pond) అతని మృతదేహం కనిపించింది. మృతుడి భార్య గోదావరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.