ePaper
More
    Homeక్రీడలుArjun Tendulkar Engagement | అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం జ‌రిగిందా.. ఎట్ట‌కేల‌కి క్లారిటీ ఇచ్చిన స‌చిన్

    Arjun Tendulkar Engagement | అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం జ‌రిగిందా.. ఎట్ట‌కేల‌కి క్లారిటీ ఇచ్చిన స‌చిన్

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Arjun Tendulkar Engagement : మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ Sachin Tendulkar త‌న‌యుడు, యువ క్రికెట‌ర్ అర్జున్ టెండూల్క‌ర్ ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించి కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో అనేక వార్త‌లు హ‌ల్చ‌ల్ చేస్తున్న విష‌యం తెలిసిందే.

    దీనిపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎట్ట‌కేల‌కి స్పందించాడు. త‌న‌ తనయుడు అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం జరిగిన విషయాన్ని తాజాగా సచిన్ స్వయంగా ధృవీకరించాడు. ప్రముఖ పారిశ్రామిక వేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్ తో అర్జున్ నిశ్చితార్థం జరిగిందని వెల్లడించారు.

    Arjun Tendulkar Engagement : క్లారిటీ వ‌చ్చింది..

    సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘రెడ్డిట్’ లో జరిగిన ‘Ask Me Anything’ (AMA) సెషన్‌లో పాల్గొన్న సచిన్ కి, ఓ అభిమాని నుండి ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న ఎదురైంది.

    “అర్జున్ టెండూల్కర్ Arjun Tendulkar నిశ్చితార్థం జరిగిందా?” అనే ప్రశ్న వేయ‌గా, దానికి స్పందించిన సచిన్.. “అవును, నిశ్చితార్థం జరిగింది. అతడి జీవితంలో కొత్త అధ్యాయానికి మేమంతా ఎదురుచూస్తున్నాం” అని స్పష్టం చేశారు.

    అర్జున్-సానియా చందోక్ జోడీ నిశ్చితార్థం జరిగిందన్న వార్తలు పది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. ఇంతవరకూ సచిన్ గానీ, సానియా కుటుంబం గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ తాజాగా వచ్చిన ఈ ధ్రువీకరణతో ఆ వార్తలకు పూర్తి క్లారిటీ వ‌చ్చింది.

    ముంబయి మీడియా సమాచారం ప్రకారం, ఆగస్టు 13న ముంబయిలో జరిగిన ఈ నిశ్చితార్థ వేడుక సన్నిహిత బంధువులు, స్నేహితుల మధ్య సింపుల్‌గా జరిగినట్లు తెలుస్తోంది.

    పెళ్లి వేడుక ఎప్పుడు అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. కాగా, సానియా చందోక్ ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు. ఆయన కుటుంబానికి హాస్పిటాలిటీ, ఫుడ్ ఇండస్ట్రీల్లో బలమైన వ్యాపార నేపథ్యం ఉంది.

    ఇంటర్ కాంటినెంటల్ హోటల్, బ్రూక్లిన్ క్రీమరీ (ఐస్ క్రీమ్ బ్రాండ్) వంటి వ్యాపార సంస్థలు రవి ఘాయ్ కుటుంబం ఆధ్వర్యంలో ఉన్నాయి.

    సానియా Sania ప్రస్తుతం ‘మిస్టర్ పాస్ పెట్ స్పా & స్టోర్’ అనే బిజినెస్‌కి డైరెక్టర్‌గా, పార్ట్‌నర్‌గా ఉన్నారు. సాధారణంగా మీడియాకు దూరంగా ఉండే ఆమె.. లో-ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఇక 25 ఏళ్ల అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం గోవా రంజీ టీమ్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు.

    Latest articles

    Hyderabad | కదులుతున్న బస్సులో మంటలు.. తప్పిన ప్రమాదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | కదులుతున్న బస్సులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈ ఘటన...

    Free Bus | ఏపీలో ఉచిత బస్సు ప‌థ‌కంతో మొద‌లైన ఇబ్బందులు.. త్వ‌ర‌లో లైవ్ ట్రాకింగ్..

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Free Bus | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న "స్త్రీ శక్తి" పథకం (Stree Shakti...

    Case On Collector | కలెక్టర్​పై కేసు నమోదు.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Case On Collector | మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌(Mahabubabad District Collector)పై కేసు నమోదైంది....

    Nizamabad Traffic Police | గుంతలను పూడ్చిన ట్రాఫిక్ పోలీసులు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad Traffic Police | నగరంలో మట్టిని తవ్వి వదిలేసిన గుంతలను ట్రాఫిక్...

    More like this

    Hyderabad | కదులుతున్న బస్సులో మంటలు.. తప్పిన ప్రమాదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | కదులుతున్న బస్సులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈ ఘటన...

    Free Bus | ఏపీలో ఉచిత బస్సు ప‌థ‌కంతో మొద‌లైన ఇబ్బందులు.. త్వ‌ర‌లో లైవ్ ట్రాకింగ్..

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Free Bus | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న "స్త్రీ శక్తి" పథకం (Stree Shakti...

    Case On Collector | కలెక్టర్​పై కేసు నమోదు.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Case On Collector | మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌(Mahabubabad District Collector)పై కేసు నమోదైంది....