HomeUncategorizedAhmedabad Plane Crash | భార్య చివ‌రి కోరిక తీర్చాల‌ని ఇండియాకి వ‌చ్చి విమాన ప్ర‌మాదంలో...

Ahmedabad Plane Crash | భార్య చివ‌రి కోరిక తీర్చాల‌ని ఇండియాకి వ‌చ్చి విమాన ప్ర‌మాదంలో మృతి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Ahmedabad Plane Crash | అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌లో London ని గాట్విక్ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం 171 టేకాఫ్ అయిన 32 సెకన్లలోనే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానం(Flight)లో ప్రయాణిస్తున్న 242 మందిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విమాన ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారికి సంబంధించిన విష‌యాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఎన్నో క‌ల‌లో కొంద‌రు ఫ్లైట్ ఎక్క‌గా, ఊహించ‌ని విధంగా క‌న్ను మూసారు. విమానం గాల్లోకి లేచిన తర్వాత కేవలం 672 అడుగుల ఎత్తుకు మాత్రమే చేరుకోగలిగింది, ఆ తర్వాత అదుపుతప్పి ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలోని మేఘానీ నగర్‌లోని బీజే మెడికల్ కాలేజ్ కాంప్లెక్స్‌(BJ Medical College Complex)లోని ఒక భవనంపై కూలిపోయింది.

Ahmedabad Plane Crash | అనాథ‌లైన పిల్ల‌లు..

అయితే భార్య అంతిమ కోరిక మేరకు ఆమె చితాభస్మాన్ని నర్మదాNarmada నదిలో కలపడానికి లండన్‌ నుంచి వచ్చిన ఇండో బ్రిటీషర్‌(Britisher) అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో మరణించాడు. లండన్‌ కేంద్రంగా నివసిస్తున్న అర్జున్‌ మనుభాయ్‌ పటోలియా (36), భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి లండన్‌లో నివసిస్తున్నాడు. వారం రోజుల క్రితం అతని భార్య భారతీబెన్‌ కన్నుమూసింది. నేను చనిపోతే నా అస్థికలు గుజరాత్‌లోని మా ఊర్లోని ఓ చెరువులో కలపండి అని కోరింది. ఆ మాట చెప్పి ఆమె చనిపోయింది. భార్య చివరి కోరిక తీర్చేందుకు భర్త లండన్‌ నుంచి ఇండియాకు వచ్చాడు. తన చివరి కోరిక తీరిస్తూ.. ఆమె అస్థికలను చెరువులో కలిపాడు.

తన భార్య అంతిమ కోరిక తీర్చాననే ఆత్మ సంతృప్తితో లండన్‌ తిరిగి వెళ్లేందుకు అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌(Ahmedabad Airport)లో విమానం ఎక్కాడు. పాపం.. కొన్ని నిమిషాల్లోనే అతను కూడా అనంతలోకాలకు వెళ్లిపోయాడు. అర్జున్ పటోలియా arjun patolia తన భార్య భారతి, ఎనిమిది, నాలుగు సంవత్సరాల వయస్సు గల వారి ఇద్దరు కుమార్తెలతో లండన్‌లో నివసించారు. భార్య కోరికని తీర్చ‌డానికి లండ‌న్(London) నుండి వ‌చ్చాడు అర్జున్. అయితే అర్జున్ అహ్మదాబాద్ నుండి లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి వెళ్లే ఎయిర్ ఇండియా విమానం(Air India plane) 171 ఎక్కి 241తో పాటు అతను కూడా మృత్యువడిలోకి జారుకున్నాడు. ప్రస్తుతం ఇద్దరు చిన్నారు తల్లిదండ్రులు లేని అనాథలయ్యారు. 10 మంది సిబ్బంది, ఇద్దరు పైలట్లు సహా 242 మందితో కూడిన ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరిన 32 సెకన్లకే కూలిపోయిన విషయం తెలిసిందే.