అక్షరటుడే, ఇందూరు: Arikela Narsareddy : నిజామాబాద్ పట్టణ మొటాడి రెడ్డి సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు బుధవారం మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డిని ఘనంగా సన్మానించారు.
Arikela Narsareddy : సమష్టిగా ముందుకు..
ఈ సందర్భంగా అరికెల నర్సారెడ్డి మాట్లాడారు. సంఘం ప్రతినిధులకు తన సహకారం ఎల్లవేళలా ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న అందర్నీ కలుపుకొని ముందుకు పోవాలని సూచించారు.
జిల్లా district రెడ్డి బంధువులకు ఎటువంటి సహకారం కావాలన్నా తనవంతు కృషి చేస్తానని తెలిపారు. అందరికీ అండగా ఉంటానని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అరికెల నర్సారెడ్డికి Motadi Reddy Welfare Association పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు గాదరి సంజీవరెడ్డి, మోతె నవీన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సన్మాన కార్యక్రమంలో కోశాధికారి శ్రీకాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు దామోదర్ రెడ్డి, సంఘ సభ్యులు వినోద్ రెడ్డి, గంగారెడ్డి, సుభాష్ రెడ్డి, శేఖర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.