అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad CP | సంక్రాంతి (Sankranthi) పండుగ సమీపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. దీంతో వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు సైతం స్వగ్రామాలకు వెళ్తుంటారు.
పండుగ సమీపిస్తుండటంతో హైదరాబాద్ (Hyderabad) నగరం నుంచి చాలా మంది స్వగ్రామాలకు పయనం అవుతున్నారు. మరో ఐదు రోజుల్లో పాఠశాలల సెలవులు ప్రారంభం కానున్నాయి. సెలవులు స్టార్ట్ కాగానే ప్రజలు స్వగ్రామాలు అధిక సంఖ్యలో వెళ్తారు. ఈ క్రమంలో ఇంటి తాళం వేసి కుటుంబంతో సహా ఊళ్లకు వెళ్లేవారికి హైదరాబాద్ సీపీ సజ్జనార్ (CP Sajjanar) కీలక సూచనలు చేశారు.
Hyderabad CP | పోలీసులకు సమాచారం ఇవ్వండి
ఇళ్లకు తాళాలు వేసి పండుగకు వెళ్లేవారు సమీప పోలీస్ స్టేషన్, బీట్ ఆఫీసర్‌కు సమాచారం ఇవ్వాలని సీపీ కోరారు. దీంతో తమ సిబ్బంది సాధారణ గస్తీలో భాగంగా అలాంటి ఇళ్లపై నిఘా ఉంచగలరని చెప్పారు. అదే సమయంలో, ప్రయాణించేటప్పుడు నగదు, బంగారం లేదా ఇతర విలువైన వస్తువులను ఇంట్లో ఉంచవద్దని సూచించారు. వాటిని బ్యాంకు లాకర్లలో, ఇతర సురక్షిత ప్రాంతాల్లో భద్రపరచాలన్నారు. దొంగతనాలను నివారించడంలో పోలీసులకు సహకరించాలని కోరారు. చిన్న జాగ్రత్తలను పాటించడంతో చోరీలను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. అలాగే పక్కింటి వాళ్లకు ఇళ్లును కనిపెట్టమని చెప్పాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు.