ePaper
More
    Homeఅంతర్జాతీయంKuwait | కువైట్​ వెళ్తున్నారా.. అయితే ఈ రూల్స్​ తెలుసుకోవాల్సిందే!

    Kuwait | కువైట్​ వెళ్తున్నారా.. అయితే ఈ రూల్స్​ తెలుసుకోవాల్సిందే!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kuwait | భారత్ (Bharat)​ నుంచి ఎంతో మంది బతుకు దెరువు కోసం కువైట్​ వెళ్తుంటారు. అలాగే ఇతరులు సైతం ఆ దేశానికి వెళ్లి వస్తుంటారు. అయితే కువైట్​ ప్రభుత్వం తాజాగా కస్టమ్స్​ నిబంధనల్లో (Customs Rules) మార్పులు చేసింది. దాని ప్రకారం ఎక్కువ మొత్తంలో నగదు, విలువైన వస్తువులు తీసుకెళ్తే ముందుగానే ప్రకటించాల్సి ఉంటుంది. లేదంటే అధికారులు సీజ్​ చేస్తారు.

    Kuwait | ఎంత తీసుకెళ్లొచ్చు అంటే..

    కువైట్​ విమానాశ్రయాల్లో (Airports) కస్టమ్స్​ రూల్స్​ను మరింత కఠినం చేసింది. దీని ప్రకారం ఆ దేశం వెళ్లేవారు, అక్కడి నుంచి వచ్చే వారు 3 వేల కువైట్ దినార్ల కంటే ఎక్కువ నగదు, లేదంటే అంత విలువ చేసే వస్తువులను తీసుకెళ్లవద్దు. భారత కరెన్సీలో రూ.8,49,387 కంటే విలువైన వస్తువులు, నగదు తీసుకెళ్తే ముందుగానే అధికారులకు తెలపాలి. లేదంటే వాటిని అధికారులు ఎయిర్​పోర్ట్​లో సీజ్​ చేస్తారు.

    READ ALSO  Tsunami effect | సునామీ ఎఫెక్ట్​.. ఎగసిపడుతున్న అలలు.. భయంతో ప్రజల పరుగులు

    Kuwait | మనీలాండరింగ్​ అరికట్టడానికి..

    అక్రమంగా డబ్బు  రవాణా (Money laundering), స్మగ్లింగ్ అరికట్టడానికి కువైట్​ ప్రభుత్వం కొత్తగా నిబంధన తీసుకొచ్చింది. తాజా రూల్స్​ ప్రకారం కువైట్​ రాకపోకలు సాగించేవారు మూడు వేల దినార్ల కంటే విలువైన నగదు, వస్తువులు ఉంటే ముందుగానే అధికారులకు తెలియజేయాలి. వాటిలో డబ్బు, బంగారం, విలువైన లోహాలు, వస్తువులు, ఆభరణాలు, కాస్ట్లీ వాచీలు, ఎలక్ట్రానిక్​ వస్తువులు ఉన్నాయి. ఈ నిబంధన విదేశీ పర్యాటకులు, ప్రవాసులకు వర్తిస్తుందని ఆ దేశం తెలిపింది.

    Kuwait | పత్రాలు దగ్గర ఉంచుకోవాలి

    మూడు వేల కువైట్​ దినార్ల కంటే విలువైన వస్తువులు, నగదు తీసుకెళ్తే కస్టమ్స్ చెక్‌పాయింట్ (Customs checkpoint) వద్ద వివరాలు ఇవ్వాలి. ఆన్​లైన్​ పోర్టల్​లో కూడా ప్రకటించే అవకాశం ఉంది. అయితే సంబంధిత వస్తువుల కొనుగోలుకు సంబంధించిన రశీదులు, ఇన్​వాయిస్​లు వెంట పెట్టుకోవాలి. ఒకవేళ నగదు తీసుకెళ్తే.. అది ఎలా సంపాదించారు.. ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలు తెలపాల్సి ఉంటుంది. ముందే ప్రకటించకపోతే వాటిని అధికారులు సీజ్​ చేసే అవకాశం ఉంది. అనంతరం ఫైన్​ వేస్తారు. కువైట్  చట్టాల ప్రకారం ఇతర చర్యలు కూడా తీసుకుంటారు.

    READ ALSO  Singapore | చూస్తుండగానే కుంగిపోయిన రోడ్డు.. గోతిలో పడ్డ కారు

    Latest articles

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    Hyderabad | ప్రియురాలితో బిజీగా ఉన్న భర్త.. భార్య ఎంట్రీతో షాక్​.. తర్వాత ఏమైందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | సమాజంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కట్టుకున్న వారిని కాదని పలువురు...

    More like this