HomeUncategorizedIran | ఇరాన్​ వెళ్తున్నారా.. అయితే అనుమతి తీసుకోవాల్సిందే

Iran | ఇరాన్​ వెళ్తున్నారా.. అయితే అనుమతి తీసుకోవాల్సిందే

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Iran | భారత్​ నుంచి ఎంతో మంది ఇరాన్​ (Iran) వెళ్తుంటారు. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇరాన్​ వెళ్లే పౌరుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

ఇరాన్​ వెళ్లేవారు అక్కడకు వెళ్లడానికి ముందుగా అనుమతి (permission) తీసుకోవాలని కేంద్రం తెలిపింది. భారత్​ నుంచి ఇరాన్​ (India to Iran) వెళ్లే ప్రయాణికులకు గతంలో కొన్ని మినహాయింపులు ఇచ్చింది. తాజాగా వాటిని ఉపసంహరించుకుంటున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. దీంతో ఇరాన్​ వెళ్లే భారతీయులకు ఇమిగ్రేషన్​ క్లియరెన్స్ తప్పనిసరి అయ్యింది.

ఎమిగ్రేషన్ చట్టం కింద ఉన్న అధికారాలను ఉపయోగిస్తూ, ఇరాన్‌కు వెళ్తున్న భారతీయుల హక్కులు, భద్రతను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం (central government) 2006 డిసెంబరు 28న S.O. 2161(E) నోటిఫికేషన్ ద్వారా ఇచ్చిన మినహాయింపును రద్దు చేస్తున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది.

Must Read
Related News