అక్షరటుడే, ఇందూరు: Manala Mohan Reddy | ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి (MLA Prashanth Reddy) మాటలు రోజురోజుకూ మితిమీరుతున్నాయని, దమ్ముంటే బీఆర్ఎస్ పదేళ్ల అభివృద్ధిపై చర్చించాలని డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. వేల్పూర్(Velpur)లో కనువిప్పు కార్యక్రమానికి వెళ్లేందుకు గురువారం ఆయన సిద్ధమవ్వగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
Manala Mohan Reddy | 18 నెలల్లో చేసి చూపించాం..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పదేళ్లలో అభివృద్ధిని తాము 18 నెలల్లో చేసి చూపించామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో రైతులకు బోనస్ ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) చెల్లించామని గుర్తుచేశారు. 9 రోజుల్లో రూ.9వేల కోట్లు ఇచ్చామన్నారు. కేరళ మినహా ఎన్ఆర్ఐ సెల్‌ను ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ (Telangana) అని స్పష్టం చేశారు. అలాగే గల్ఫ్ బాధితులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించామని, వేల్పూరులోనూ 18 మందికి అందించామన్నారు.
Manala Mohan Reddy | కేటీఆర్.. హరీష్ రావు మాటలు సరికాదు…
బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao) కాంగ్రెస్‌పై చేస్తున్న వ్యాఖ్యలు సరికాని మోహన్ రెడ్డి(Manala Mohan Reddy) పేర్కొన్నారు. వారిని చూసి ప్రశాంత్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సీఎంపై, ప్రభుత్వంపై అనవసరపు మాటలు మాట్లాడితే ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు.
Manala Mohan Reddy | మేం గాంధేయవాదులం..
తాము పూర్తిగా గాంధేయ వాదులమని కేవలం కాంగ్రెస్ చేసిన అభివృద్ధిపై మాత్రమే మాట్లాడేందుకు వేల్పూర్ వెళ్తానని మానాల పేర్కొన్నారు. అయినప్పటికీ పోలీసులు తమను అడ్డుకున్నారన్నారు. సమావేశంలో నాయకులు రోహిత్, పంచ రెడ్డి చరణ్, వేణురాజ్ తదితరులు పాల్గొన్నారు.