Homeబిజినెస్​UPI Transactions | దేశంలో ఈ రేంజ్​లో యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయా.. ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

UPI Transactions | దేశంలో ఈ రేంజ్​లో యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయా.. ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

భారతదేశంలో యూపీఐ లావాదేవీలు 85 శాతం జరుగుతున్నాయని ఆర్​బీఐ గవర్నర్​ సంజయ్​ మల్హోత్రా తెలిపారు. 280 బిలియన్ డాలర్ల విలువ కలిగిన చెల్లింపులు జరుగుతున్నాయని వివరించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: UPI Transactions | షాపింగ్​ మాల్​ నుంచి రోడ్డు పక్కన కూరగాయల బండి వరకు డిజిటల్​ పేమెంట్​ చేసే సౌలభ్యం కలిగింది. ప్రతి షాపులో క్యూర్​ కోడ్​ అందుబాటులోకి వచ్చింది. డిజిటల్​ లావాదేవీల్లో మన దేశంలో అగ్ర దేశాలను సైతం దాటేస్తోంది. మన దేశంలో డిజిటల్​ లావాదేవీలు (Digital Transactions) ఎంతలా పెరిగాయంటే 85 శాతం ట్రాన్​సాక్షన్స్​ యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. ఈ విషయం స్వయంగా ఆర్​బీఐ గవర్నర్​ సంజయ్​ మల్హోత్రా వెల్లడించారు.

భారతదేశంలో 85 శాతం డిజిటల్ పేమెంట్ (Digital Payment) లావాదేవీలు.. యూపీఐ (యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ద్వారా జరుగుతున్నాయని తెలిపారు. యూపీఐ ఇప్పటివరకు డిజిటల్ చెల్లింపుల రంగాన్ని పూర్తిగా మార్చిందని ఆయన వివరించారు. నెలకు సుమారు 20 బిలియన్ల లావాదేవీలు, 280 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువ కలిగిన యూపీఐ చెల్లింపులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. చిన్న వ్యాపారులు, మైక్రో ఎంటర్​ ప్రైజెస్​ కూడా డిజిటల్ చెల్లింపులను స్వీకరిస్తున్నారని తెలిపారు. ఇది వారికి తక్కువ వడ్డీ రేట్లతో ఫార్మల్ క్రెడిట్ పొందడానికి దోహదం చేస్తుందని చెప్పారు.

UPI Transactions | ఇతర దేశాలకు ఆదర్శం

యూపీఐ పేమెంట్​ (UPI Payment) విధానం ఇతర దేశాలకు సైతం ఆదర్శంగా నిలుస్తోందని ఆర్​బీఐ గవర్నర్​ అన్నారు. భారతదేశం అభివృద్ధి చేసిన ఈ మోడ్యూలర్ ఓపెన్-సోర్స్ ఐడెంటిటీ ప్లాట్‌ఫామ్ (MOSIP) గురించి కూడా వివరించారు. ఇది ఉచితంగా అందుబాటులో ఉండే, సురక్షితమైన, స్కేలబుల్ డిజిటల్ ఐడెంటిటీ ప్లాట్‌ఫామ్ అని వివరించారు. ఇప్పటివరకు 27 దేశాలు యూపీ ఆధారిత వ్యవస్థలను వినియోగించడం లేదా పరిశీలించడంలో ఉన్నాయని చెప్పారు.

UPI Transactions | గ్లోబల్ సహకారానికి భారత్ సిద్ధం..

భారత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ప్రాథమిక సేవలు త్వరగా, సులభంగా అందించగలవని మల్హోత్రా తెలిపారు. భారత్​ ప్రపంచ దేశాలతో ఈ రంగంలో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని చెప్పారు.