అక్షరటుడే, హైదరాబాద్ : Cockroach | సాధారణంగా ప్రతి ఇంట్లో బొద్దింకలు కనిపిస్తుంటాయి. అయితే ఇవి కేవలం అసౌకర్యానికే కాదు, అనేక ఆరోగ్య సమస్యలకు కూడా కారణమవుతాయి. పగిలిన గోడలు, అపరిశుభ్రమైన వాతావరణం (Unclean Environment), ఎక్కడపడితే అక్కడ పడి ఉండే వస్తువులు, లీకవుతున్న పైపులు, గజిబిజిగా ఉండే ఇంట్లో బొద్దింకలు త్వరగా స్థావరం ఏర్పరచుకుంటాయి.
ముఖ్యంగా, అవి రాత్రిపూట తిరిగేటప్పుడు ఆహార పదార్థాలను కలుషితం చేస్తాయి. ఈ పదార్థాలను తినడం వల్ల అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ బొద్దింకలను (Cockroach) వదిలించుకోవడానికి రసాయనాలను వాడినా అవి మళ్లీమళ్లీ వస్తుంటాయి. ముఖ్యంగా, చిన్న పిల్లలకు వ్యాధులు త్వరగా వ్యాప్తించే అవకాశం ఉంది. అందుకే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.
Cockroach | బొద్దింకల నిర్మూలనకు మార్గాలివే..
బొద్దింకలను ఒక్కసారిగా పూర్తిగా రాకుండా చేయడం కష్టం. అయితే, నిరంతర శుభ్రతను పాటించడం వల్ల వాటి బెడదను తగ్గించవచ్చు. వాటిని పూర్తిగా నివారించడానికి కొన్ని సులభమైన చిట్కాలు పాటించాలి.
- ఇంట్లో బొరియలు లేదా పగుళ్లు లేకుండా జాగ్రత్త పడాలి.
- నీటి నిల్వలు ఉండే ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.
- ఇంట్లో అనవసరమైన వస్తువులను, ముఖ్యంగా కార్డ్బోర్డ్ పెట్టెలు (Cardboard Boxes), పాత పేపర్లు వంటివాటిని తొలగించాలి.
- ధూళి, దుమ్ము పేరుకుపోకుండా ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి.
- తిన్న తర్వాత వెంటనే పాత్రలను శుభ్రం చేసుకోవాలి.
- చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలి.
- పాత వార్తాపత్రికలను ఎక్కువ కాలం ఇంట్లో ఉంచకూడదు.
- ఉతికిన బట్టలను వెంటనే మడతపెట్టుకోవాలి.
- వారానికి ఒకసారి ఇంట్లో వస్తువుల వెనుక ఉన్న చెత్తను శుభ్రం చేయాలి.
- కుళ్లిన పదార్థాలను ఇంట్లో ఉంచకుండా, చెత్తను ఎప్పటికప్పుడు బయట పడేయాలి.
- ఈ చిన్న చిన్న మార్పులు పాటించడం ద్వారా బొద్దింకల నుంచి ఉపశమనం పొందడమే కాకుండా, మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.